ప్రాంతీయ విభేదాల పాపంలో పాత్రదారులు వారే ..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కలిసి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రాంతీయ మధ్య విభేదాలను రాజేసి చిచ్చుపెడుతున్నారని సినీ నటుడు శివాజీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రైతుల క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన జగన్ రెడ్డి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రైతుల పాదయాత్రకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పుటికీ వాటిని దాటుకుంటూ రైతులు ముందుకు సాగారు. రేపు తిరుపతి బహిరంగ సమావేశానికి ప్రభుత్వం సహకరించకుంటే, కోర్టు నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆయన వాపోయ్యారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన అమరావతి రైతుల వాటిని ఛేదించుకుంటూ.. తిరుపతి చేరుకున్నారని, పాదయాత్ర ను దిగ్విజయంగా పూర్తి చేసి రైతులకు ఆయన అభినందనందనలు తెలిపారు. జగన్ ప్రశాంత్ కిషోర్ రాబోయే రోజుల్లో మరిన్ని కుట్రలు పన్నుతున్నారని, కేవలం ఎన్నికలను డబ్బుతోనే నిర్వహించాలని వ్యూహాలను పన్నుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బుతో ఓట్లు కొనవచ్చు అనే నేపంతో పాలనను గాలికొదిలేశారని ఎద్దేవా చెశారు.
Must Read ;- తిరుపతి మహోద్యమ సభకు సర్వసిద్ధం ..!











