‘కోబలి’.. చాలా సంవత్సరాలుగా వినిపిస్తున్న సినిమా పేరు. ‘కోబలి’ సినిమా పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు పవన్ కళ్యాణ్, ‘కోబలి’ సినిమా పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తీస్తున్నారని ఆ మధ్య పుకార్లు షికారు చేసాయి. కానీ అది వట్టి పుకార్లే అని తేలిపోయింది. మరల ఇంత కాలానికి ‘కోబలి’ సినిమా పేరు తెరపైకి వచ్చింది. గతంలో గబ్బర్‌సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీని తీసిన నిర్మాత బండ్ల గణేష్ తన దేవుడితో మరో సినిమా తీయనున్నట్లు రెండ్రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా వివరాలు, సాంకేతిక నిపుణుల వివరాలను బండ్ల గణేష్ వెల్లడించలేదు. ఈ సినిమా కోసం టాలీవుడ్‌లో అప్పుడే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్‌తో ‘కోబలి’ పేరుతో భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేశారు. కాని పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వలన ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఇటీవల పవన్ మళ్లీ వరుస సినిమాలు చేస్తుండడంతో ‘కోబలి’ సినిమా పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. మరోవైపు ‘కోబలి’ సినిమా ఒక్క పవన్ కళ్యాణ్ తో మాత్రమే తీస్తానని దర్శుకుడు త్రివిక్రమ్ అనేక సార్లు చెప్పాడు.
ఇప్పుడు బండ్ల గణేష్ పవన్‌తో మూవీ అనౌన్స్ చేయగానే అది ‘కోబలి’ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడని టాలీవుడ్ టాక్. మరి చూడాలి ఈ వార్తలో ఎంత నిజం ఉందో. ఇప్పటికే పవన్ ‘వకీల్ సాబ్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తరువాత పవన్, క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు విరూపాక్ష అనే బలమైన టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రం తరువాత పవన్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం కథపై కసరత్తులు చేస్తున్నాడు హరీష్ శంకర్.











