‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన‘ సాహో’ తెలుగులో డిజాస్టర్ అయి, హిందీలో మంచిహిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీని తర్వాత రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ చిత్రం చేస్తున్నాడు. యు.వి. క్రియేషన్స్‌తో కలిసి కృష్ణంరాజు తన సొంత నిర్మాణ నిర్మాణ సంస్థ అయిన గోపీకృష్ణా మూవీస్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. పీరియాడిక్ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ.. ప్రభాస్‌కి తల్లిగా నటిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత ‘మిర్చి’ సినిమాలో కనిపించిన ఒకప్పటి హీరోయిన్ నదియా ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో చాలా మంచి క్యారెక్టర్స్ చేసింది. ఇప్పుడు భాగ్యశ్రీ కూడా చాలా సంవత్సరాల తర్వాత కెమెరా ముందుకు వస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో పూజా హెగ్డే మ్యూజిక్ టీచర్‌గా కనిపిస్తుంది.
దాదాపు 90 శాతం పూర్తయిన ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతోంది. ఇటలీలో 15 రోజులపాటు జరిగే షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం.ఆర్.రెహమాస్ ఆ బాధ్యతను తీసుకుంటారని తెలుస్తోంది. ఈమధ్య కాలంలో రెహమాన్ తెలుగు సినిమాకు సంగీతం అందించలేదు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో చేసే సోషియో ఫాంటసీ సినిమాకి కూడా రెహమాన్‌ను తీసుకుంటే బాగుంటుందని భావిస్తోంది చిత్ర యూనిట్. రెహమాన్ అయితే సినిమా బడ్జెట్ బాగా పెరిగే అవకాశం ఉంది. అయినా సినిమాకి మంచి క్రేజ్ రావాలంటే రెహమాన్ లాంటి టెక్నీషియన్ ఎంతో అవసరమని నాగ్ అశ్విన్ అభిప్రాయం.











