అక్టోబర్2 గాంధీ జయంతి సందర్భంగా, తలసేమియా భాదితుల కోసం తెలంగాణా తెలుగు యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న రక్త దాన శిబిరానికి పిలునిచ్చారు హిందుపూర్ శాసన సభ్యులు, అగ్ర కథానాయకుడు, బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ తలసేమియా వ్యాధి గురించి వివరించారు. అలాగే రక్త దానం పట్ల ప్రచారంలో ఉన్న పలు అపోహలను తొలగించారు. మానవాళి ఎంత అభివృద్ధి చెందినా రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదు కాబట్టి, తోటి ప్రాణాలను కాపాడడానికి మనకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం రక్త దానం మాత్రమే అని తెలుపుతూ అభిమానులు, కార్యకర్తలు, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్త దానం, ప్లాస్మా దానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు.
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా, తలసేమియా బాధితుల కోసం తెలంగాణా తెలుగు యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న రక్త దాన శిబిరానికి పిలుపును అందిస్తున్న హిందుపూర్ శాసన సభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ #NandamuriBalakrishna pic.twitter.com/oi3jcUfwP5
— BA Raju's Team (@baraju_SuperHit) September 30, 2020











