వైసీపీ ఎంపీ రఘురామరాజు తన అరెస్టు,తరువాత జరిగిన పరిణామాలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు.తనపై రాజద్రోహం కింద అక్రమ కేసులు పెట్టి సీఐడీ అధికారులు కస్టడీలో చిత్రహింసలు పెట్టారని ఆయన స్పీకర్ కు తెలిపారు.గుంటూరు వైద్యులు తప్పుడు నివేదికలు ఇచ్చారని,సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నానని,అక్కడ ఇచ్చిన నివేదికల ఆధారంగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు.సీఎం జగన్,డీజీపీ,సీఐడి ఏడీజీలపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన వినతి పత్రం సమర్పించారు.రఘురామరాజు రెండు కాళ్లకు కట్లు చూసి ఓ బిర్లా చెలించపోయినట్టు తెలుస్తోంది.విచారించి తగిన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారని సమాచారం.
జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వేసినందుకే..
తనపై అక్రమ కేసులు పెట్టడం,కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం,గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలను తారుమారు చేయడం వంటి విషయాలతో పాటు,ఆర్మీ ఆసుపత్రి నుంచి బలవంతంగా డిశ్చార్జ్ చేసి మరల అరెస్టు చేయాలని చూశారని ఎంపీ రఘురామరాజు స్పీకర్ ఓం బిర్లాకు వివరించారు.సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ వేయడం వల్లే తనపై కక్ష కట్టారని రఘురామరాజు స్పీకర్‌కు తెలిపారు.బెయిల్ రద్దు పిటీషన్ ఉపసంహరించుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఎంపీ వివరించారు.అన్నివిషయాలు తెలసుకున్న స్పీకర్ ఓం బిర్లా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకునేందుకు సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.
Must Read ;- ఆ ముగ్గురూ కుట్ర చేశారు : రఘురామరాజు సంచలన ఆరోపణలు!











