చిన్న చిన్న తగాదాలు పెరిగి పెద్దవి కావడంతో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇలాంటి ఘటనే ఒకటి సంచలనం సృష్టించింది. పాల ప్యాకెట్ అప్పు విషయంలో ఇద్దరు యువకుల మధ్య గొడవ మొదలైంది. రూ.50 రూపాయల అప్పు ఇవ్వాలని పాలపాకెట్ కు వచ్చిన యువకుడు బాజీ అనే పాల వ్యాపారిని కోరాడు. అతను తిరస్కరించడంతో గొడవ మొదలైంది. పాల ప్యాకెట్ తీసుకోవడానికి వచ్చిన యువకుడు మరికొందరితో కలసి బాజీపై పిడిగుద్దులు కురిపించడంతో అతను కుప్పకూలిపోయాడు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయినా ప్రయోజనం దక్కలేదు. అప్పటికే బాజీ చనిపోయాడని పరీక్షించిన డాక్టర్ ప్రకటించారు.
కేసు నమోదు
పాల వ్యాపారి బాజీపై దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేవలం రూ.50 కోసం యువకులు ఘర్షణ పడటం, అందులో ఒకరు చనిపోవడం జిల్లాలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Must Read ;- గుంటూరు జిల్లాలో టీడీపీ నేత దారుణహత్య