ఫిట్ నెస్ విషయంలో హీరోయిన్ లే కాదు హీరోలు కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ ఫిట్ నెస్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా షెడ్యూల్ ను దుబాయ్ లో ప్లాన్ చేశారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘సరిలేరు మీకెవ్వరు’ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రమిది. బహుశా వచ్చే సంక్రాంతి విడుదల టార్గెట్ గా ఈ చిత్రం రూపొందుతోంది.
బ్యాంకింగ్ రంగంలో మోసాలు ఎలా జరుగుతాయో ఇందులో చూపించబోతున్నారు. హీరోలకు క్రేజ్ పెరుగుతున్నా ఏజ్ తగ్గిపోతోందనే విషయాన్ని మరువకూడదు. ఎంత స్టార్ హీరోయిన్ అయినా ఐదేళ్లకు మించిన కెరీర్ ఇప్పుడు ఉండటం లేదు. హీరోల విషయంలో అలా కాదు వారికి 70 ఏళ్ల వయసు వచ్చినా హీరోలుగానే కొనసాగుతున్నారు. అదే ఎన్టీఆర్, ఏయన్నార్ ల కాలంలో అసలు వయసును పట్టించుకోకుండా సినిమాలు చూశారుగానీ ఇప్పుడలా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
దానికి కారణం ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు, కుర్ర హీరోల దూకుడు. అందువల్ల వయసు విషయంలో హీరోలు జాగ్రత్తలు పాటించాల్సిందే. ముఖ్యంగా మహేష్ అంటే అమ్మాయిల్లో క్రేజ్ ఎక్కువ. అలాంటి మహేష్ ఫిట్ నెస్ విషయంలో జాగ్రత పడకపోతే క్యూట్ నెస్ విషయం తేడా వచ్చేస్తుంది మరి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహేష్ తన ఫిట్ నెస్ వీడియో ఒకటి పోస్ట్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో ఉన్న ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. బాక్స్ జంప్ వీడియో అది. మహేష్ చేసే ఈ వర్కవుట్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.
Must Read ;- మహేష్ వెంకీ మూవీ కన్ ఫర్మ్ అయ్యిందా.?