మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ చేస్తే రెండు కళ్ళూ చాలవు. ఆయన పక్కన ఎంత అందగత్తె డ్యాన్స్ చేస్తున్నా.. అందరి చూపులూ చిరు లెగ్స్ మీదే ఉంటాయి. ఆయన ఎంత వెరైటీ మూమెంట్స్ వేస్తున్నాడు. ఎంతలా ఆ స్టెప్స్ కు తన గ్రేస్ ను యాడ్ చేస్తాడు అని చూస్తారు అభిమానులు. ప్రస్తుతం ఆయన వయసు 66. కానీ ఆయన చేసే డ్యాన్స్ మాత్రం 26 ఏళ్ళ కుర్రాడిదే. ఈ వయసులో కూడా తన బాడీని తన చెప్పుచేతల్లో ఉంచుకోవడం .. ఆయనకే చెల్లింది. ఆచార్య సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ .. లాహే లాహే లో చేసిన డ్యాన్సే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. నిన్న విడుదలైన ఈ పాటకు సంబంధించిన ప్రోమో లోని చిరు స్టెప్పులకే అభిమానులు వెర్రెత్తి పోయారు. ఇప్పుడు ఫుల్ లిరికల్ సాంగ్ లోని ఆయన డ్యాన్స్ మూమెంట్స్ కు ఫిదా అవుతున్నారు. మణిశర్మ సంగీతానికి.. చిరు చిందులు తోడైతే.. ఇంక చెప్పేదేముంది? లాహే.. లాహే.. అంటున్నారు అభిమానులు. ఈ సాయంత్రం 4.05 గంటలకు విడుదలైన ఈ లిరికల్ సాంగ్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ తో .. మణిశర్మ మాస్టారి సంగీతం తో లాహే లాహే పాట.. మెగా స్టెప్పుల మయంతో యూ ట్యూబ్ ను ఊపేస్తోంది. ‘కొర కొర కొరువులు మండే కళ్ళు.. జడలిరబోసిన సింపిరి కురులు.. ఎర్రటి కోపాలెగిసిన కుంకం బొట్టు.. వెన్నెల కాసిందే.. పెనిమిటి రాకను తెలిసి సీమాతంగి..’ అంటూ రామ జోగయ్య చేసిన పదాల విన్యాసం.. ఖలేజా లోని సదాశివా సన్యాసీ తాపసీ కైలాస వాసీ అనే పాటను గుర్తుకు చేస్తోంది. ఈ పాటలో చిరు కాస్ట్యూమ్స్ అభిమానుల్ని భలేగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో లాహే.. లాహే.. అంటూ తెగ ట్రెండ్ అవుతోంది. మరి కాసిని స్టెప్స్ కే అభిమానులు ఊగిపోతున్నారు. మరి ఆచార్య సినిమా విడుదలయ్యాకా.. థియేటర్స్ లో ఈ పాట ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందో చూడాలి.
Must Read ;- మెగా ‘ఆచార్య’ పాన్ ఇండియా ప్లాన్ కు అడ్డంకులు











