నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాలు ఎంత సెన్సేషన్ హిట్స్ అవుతాయో ప్రత్యేకించి చెప్పనవరసం లేదు. అలాగే బయట ఆయన మాట్లాడే తీరు, అభిమానుల పట్ల ప్రవర్తించే విధానం కూడా అంతే సెన్సేషన్ అవుతూ ఉంటాయి. పబ్లిక్ మీటింగ్స్ లో ఫాన్స్ మీద చెయి చేసుకోవడం, ఆడియో ఫంక్షన్స్ లో ఆడవాళ్ళ మీద సెటైర్స్ వేయడం పై నెటిజన్లు అనేక సార్లు కామెంట్స్ చేసినా మళ్ళీ మళ్ళీ అవి రిపీట్ అవుతుండడం గమనార్హం . స్వతహాగా సినీ పరిశ్రమలో మంచి మనసున్న వ్యక్తి అనే పేరు ఉన్న బాలయ్యపై ఇలాంటి కామెంట్స్ రావడం అభిమానులకు కాస్తంత కష్టంగా ఉంది.
తాజాగా బాలయ్య ప్రవర్తనపై మరోసారి నెటిజన్లు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. అందుకు కారణం బాలయ్య ఈ మధ్య ‘సెహరీ’ అనే సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి హాజరైయ్యారు. ఆ ఫంక్షన్ లో బాలయ్య ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘సెహరీ’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న హర్ష చేతి మీద బాలయ్య కొట్టారు. బాలయ్య పోస్టర్ రిలీజ్ చేస్తున్న సమయంలో హీరో పోస్టర్ ను పట్టుకోవడంతో బాలయ్య చేతితో హీరో చేతి మీద కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోపై భయంకరమైన కామెంట్స్ రావడంతో ‘సెహరీ’ హీరో హర్ష వివరణ ఇచ్చాడు. బాలకృష్ణ తీరుని తప్పుగా అర్ధం చేసుకున్నట్లు తెలిపాడు హర్ష. నిజానికి బాలకృష్ణ నన్ను కొట్టలేదని తెలిపాడు. బాలయ్య పోస్టర్ రిలీజ్ చేస్తున్నప్పుడు నేను ఆ పోస్టర్ ను నా ఎడమ చేత్తో పట్టుకోవడానికి ట్రై చేశాను. అప్పుడు బాలకృష్ణగారు నా చేతిని పక్కకు నెట్టారు అని తెలిపాడు. హీరోగా మొదటి సినిమా చేస్తున్నప్పుడు ఎడమ చేత్తో పోస్టర్ ను పట్టుకోవడం మంచిది కాదని, అందుకనే నా చేతిని పక్కకు లాగారని తెలిపాడు హర్ష. ఇది కావాలని చేసిన పని కాదని వివరణ ఇచ్చాడు హర్ష. బాలకృష్ణగారు చాలా మంచి వ్యక్తి అని, తమ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కార్యక్రమానికి పిలిచిన వెంటనే ఆయన వచ్చారని చెప్పాడు హర్ష. మరి హీరో హర్ష కనుమల్లి వివరణతోనైనా బాలయ్యపై ట్రోల్స్ ఆగుతాయో లేదో చూడాలి.
Must Read ;- బాలకృష్ణతో తలపడే విలన్ గా రాజశేఖర్?











