తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. రాజకీయాల్లోకి రానున్నట్టు.. గత సంవత్సరం డిసెంబర్ 31న ప్రకటిస్తానని చెప్పడం తెలిసిందే. అందుకనే ముందుగా తను ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేయాలి అనుకున్నారు. అన్నాత్తే సినిమా షూటింగ్ కంప్లీట్ చేద్దామని హైదరాబాద్ వచ్చారు రజనీకాంత్. కరోనా కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేసినప్పటికీ.. రజనీకాంత్ అస్వస్థకు గురవ్వడంతో హైదరాబాద్ అపోలో హాస్పటల్ లో ట్రీట్ మెంట్ తీసుకున్నారు.
ఆతర్వాత కోలుకుని చెన్నైలో ఇంటికి చేరుకున్నరజనీకాంత్.. రాజకీయాల్లోకి రాలేనని మూడు పేజీల లేఖను విడుదల చేశారు. రజనీ అభిప్రాయంతో నిరాశకు లోనైన అభిమానులు అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ నిరసనను తెలియచేస్తూనే ఉన్నారు. రజనీ తన నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని కోరుతూ అభిమానులు ఆందోళన చేస్తున్నారు. రజనీ ఇంటి ముందే చాలా మంది అభిమానులు నిరసన తెలియచేయడం జరిగింది.
దీంతో రజనీకాంత్ మరోసారి స్పందించారు. ట్విట్టర్ లో రజనీకాంత్ ఏమన్నారంటే.. తన నిర్ణయాన్ని ఇది వరకే చెప్పానని.. రాజకీయాల్లోకి రమ్మని ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్ అంటూ రాజకీయాల్లోకి రానని మరోసారి స్పష్టం చేశారు. రజనీకాంత్ మక్కళ్ మండ్రం బాధ్యతల నుంచి తొలగించబడిన పలువురితో కలిసి చెన్నైలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతే కాకుండా.. ఆందోళన కూడా చేశారు. ఈ ఆందోళన పై స్పందించిన రజనీకాంత్ తాజా ప్రకటనతో క్లారిటీ ఇచ్చారు. మరి.. ఇకనైనా రజనీకాంత్ అభిమానుల నిరసనలు ఆగుతాయని ఆశిద్దాం.
Also Read ;- రజనీ మద్దతు ఎవరికి.. కమల్ కా.? బీజేపీకా.?
— Rajinikanth (@rajinikanth) January 11, 2021