సూపర్ స్టార్ రజినీ కాంత్ అంటే మజాకానా.. ఒక్కసారి బరిలోకి దిగాక వెనక్కి తిరిగి చూసుకునే రకం కాదు. ఈ నెలాఖరులో రాజకీయ పార్టీని ప్రకటించాల్సి ఉంది. ఈలోగా తను నటిస్తున్న అన్నాత్తే సినిమా షూటింగును కూడా పూర్తి చేసేయాలి కాబట్టి దూకుడు పెంచేశాడు. రామోజీ ఫిలింసిటీలో జరిగే అన్నాత్తే షూటింగ్ పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ వచ్చేశారు. అసలు ఈ షూటింగు అక్టోబరులోనే జరగాల్సి ఉంది. అప్పుడు జరిగి ఉంటే ఆ నెలాఖరుకు సినిమా షూటింగు పూర్తయి ఉండేది.
శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి ‘అన్నాత్తే’ అనే పేరును నిర్ణయించారు. అన్నాత్తే అంటే అన్నయ్య అని అర్థం. తమిళనాడులో మరో తంబిగా రజినీ మారబోతున్నారన్నది దీన్ని బట్టి స్పష్టమవుతోంది. రాజకీయ అడుగుజాడల విషయంలో రజినీ ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి సీనియర్ల బాటలోనే పయనించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ఎన్టీఆర్ ను అన్నగారు అంటూ అందరూ సంబోధించేవారు. అలాగే ఎంజీఆర్ ను తంబిగా పిలిచేవారు.

ఈ సినిమా షూటింగును త్వరతగతిన పూర్తిచేయాలన్న సంకల్పం ఎన్టీఆర్ లో ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు మీనా, ఖుష్‌బూ ఈ సినిమాలో రజనీకాంత్ సరసన నటిస్తున్నారు. ఇప్పటి స్టార్ హీరోయిన్, మహానటి కీర్తి సురేష్ కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. రజినీ ఎన్నికల సమయానికి ముందే ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలనుకున్నారు. అనుకోని అవాంతరాల వల్ల షూటింగు వాయిదా పడుతూ వచ్చింది.
జనవరిలో విడుదల చేయడం కన్నా మార్చిలో విడుదల చేస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా ఉంది. అప్పటికి రాజకీయ వేడి కూడా పుంజుకుంటుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే లోకేష్ కనకరాజ్‌తో రజినీకాంత్ సినిమా చేయాల్సి ఉన్నా రాజకీయాల కారణంగా ఆ సినిమాను వదులుకున్నట్లు తెలుస్తోంది. సినిమాల పరంగా చెప్పాల్సి వస్తే రజినీ కాంత్ కు ఇదే ఆఖరి సినిమా అని చెప్పాల్సి ఉంటుంది.
#SuperstarRajinikanth leaves to Hyderabad for #Annaatthe shoot pic.twitter.com/1YVdhVcIMY
— Sun Pictures (@sunpictures) December 13, 2020
Must Read ;- రజినీ, కమల్.. మల్టీస్టారర్ రాజకీయమేనా?











