తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడం.. ఆతర్వాత అనారోగ్య కారణాల వలన రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించడం తెలిసిందే. అభిమానులు క్షమించాలి అంటూ మూడు పేజీల లేఖను విడుదల చేసారు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన అభిమానులు తమిళనాడు రాష్ట్రంలోని పలు చోట్లా ఆందోళన చేసారు. రజనీకాంత్ ఇంటి ముందే ఆందోళన చేయడం కూడా జరిగింది.
రజనీ రాజకీయాలకు రానని చెప్పడంతో తమిళనాడులోని రాజకీయ పార్టీల్లో ఊపు వచ్చింది. ఏంటంటే.. రజనీ రాజకీయాల్లోకి రావడం లేదు కాబట్టి ఆయన మద్దతును పొందాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూనివర్శల్ హీరో కమల్ హాసన్ రజనీకాంత్ మద్దతు కావాలని కోరతానని ప్రకటించారు. ఇక బీజేపీ అయితే.. రజనీకాంత్ మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
దీంతో రజనీకాంత్ ఎవరికి మద్దతు ఇస్తారు.? తన స్నేహితుడు అయిన కమల్ హాసన్ కి మద్దతు ఇస్తారా.? లేక బీజేపీకి మద్దతు ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. ఈ రెండు పార్టీలకు కాకుండా వేరే పార్టీలకు మద్దతు ఇస్తారా.? లేక ఎవరికీ మద్దతు ఇవ్వకుండా సైలెంట్ గా ఉంటారా..? అనేది అటు రాజకీయ వర్గాల్లోను ఇటు సినీ వర్గాల్లోను హాట్ టాపిక్ అయ్యింది. మరి.. రజనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Must Read ;- రజనీకాంత్ అప్పుడు చాలా ఫీలయ్యారట!