కరోనా కల్లోలాలికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది మహారాష్ట్ర. కరోనా కేసుల్లో, మరణాల్లో మొదటి నుండి వార్తల్లో నిలిచిన మహారాష్ట్ర.. మళ్లీ సరికొత్త రికార్డుతో వార్తల్లోకెక్కింది. 307 రోజుల కరోనా ప్రయాణం.. 50 వేల పైచిలుకు మరణాలు.. దేశంలో మూడో వంతు మరణాలు అక్కడే. కొన్ని దేశాల్లో సంభవించిన మొత్తం మరణాల సంఖ్య కంటే ఇది ఎక్కువ కావడం ఆందోళన చెందాల్సిన విషయం. కేవలం దేశంలోనే కాదు.. ఏకంగా ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు సంభవించిన రాష్ట్రంగా కరోనా పుస్తకంలో రికార్డు సొంతం చేసుకుంది.
Must Read ;-‘చోలుటెకా బ్రిడ్జ్’కి కరోనాకి ఏంటి సారుప్యం?
మరణాల రికార్డు
మహారాష్ట్రలో కరోనా సృష్టించిన విలయం ఇది. ప్రపంచంలో మరే రాష్ట్రంలోనూ కొవిడ్‌తో ఇంతమంది చనిపోలేదు. ఆ తర్వాతి స్థానంలో అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం ఉంది. ఇక్కడ 40 వేల మంది మరణించారు. మహారాష్ట్రలో మొత్తం మరణాల సంఖ్య 50 వేలు దాటింది. మొత్తం దేశంలో కరోనాతో మృతి చెందిన ప్రతి ముగ్గురిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన వారే. ఆ రాష్ట్రంలోని ప్రతి పదిమంది కరోనా మృతుల్లో ఏడుగురు.. ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారే. ఐదుగురు రెండేసి వ్యాధుల పీడితులు. 69.80 శాతం మంది పుషులు, 29.60 శాతం మంది మహిళలు (15 వేల మంది) 60-69 ఏళ్ల మధ్య వయస్కులు కాగా.. ప్రతి ఐదుగురు మృతుల్లో ఒకరు 50-70 ఏళ్ల మధ్య వారు. 46.70 శాతం మంది అధిక రక్తపోటు బాధితులు కాగా.. 39.40 శాతం మంది మధుమేహ వ్యాధి గ్రస్తులు. ప్రతి ఐదుగురిలో ఒకరికి ఈ రెండు వ్యాధులూ ఉన్నాయి. ఒక్క ముంబై నగరంలోనే దాదాపు 11 వేల మంది మరణించారు. ఇది తమిళనాడు, కర్ణాటకలకు దాదాపు సమానం కావడం గమనార్హం.
వృద్ధుల రాష్ట్రం
మహారాష్ట్రలో వృద్ధుల జనాభా అధికంగా ఉండడమే దీనికి కారణమని, కొమార్బిటీస్ రోగులు కూడా ఇక్కడే అధికంగా ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఇక్కడ మరణాలు ఎక్కువగా సంభవించాయని భావిస్తున్నారు. తొలి 10 వేల మరణాలకు 116 రోజులు పట్టగా.. తర్వాతి 10 వేల మరణాలు కేవలం 36 రోజుల్లోనే సంభవించాయి. ఆ తర్వాత 10 వేలకు 30 రోజులు, తదుపరి 10 వేలకు 25 రోజులు పట్టింది. చివరి 10 వేలకు మాత్రం.. కరోనా ఉధృతి తగ్గడంతో 90 రోజుల సమయం పట్టింది. ప్రస్తుతం మహారాష్ట్రలో మరణాల రేటు 2.50గా ఉంది. ఇది జాతీయ సగటు (1.4) కంటే అధికం కావడం గమనార్హం.
Must Read ;- తమకు ఇబ్బందులు తప్పవనే.. శివసేన టార్గెట్ సోనూ సూద్