ఇటీవల కోలీవుడ్ లో సంచనల విజయం సాధించిన సినిమా ‘కర్ణన్’. యంగ్ టాలెంటెడ్ ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలోని ధనుష్ నటనకి ముచ్చటగా మూడోసారి నేషనల్ అవార్డ్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. అలాంటి ప్రత్యేకతను సంతరించుకున్న ఈ సినిమా తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ తో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే.
బెల్లంకొండ సురేశ్ నిర్మాణంలో త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ సినిమా ను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఒరిజినల్ వెర్షన్ లో కథానాయకుడికి మార్గదర్శిగా మలయాళ నటుడు లాల్ నటించారు. ఈ పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది. అందుకే తెలుగు వెర్షన్ లో ఆ పాత్ర రావు రమేశ్ చేయబోతున్నారట.
ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలిగే రావు రమేశ్ .. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లోనూ ఉన్నారు. అలాగే వెంకీ ‘నారప్ప’లో కూడా ఆయనకో ప్రత్యేక పాత్ర నిచ్చిన శ్రీకాంత్ అడ్డాల.. ఇప్పుడు కర్ణన్ తెలుగు వెర్షన్ లో కూడా లాల్ పాత్రను ఆఫర్ చేశారట. మరి ఇందులో నిజానిజాలేంటో తెలియదు కానీ.. రావు రమేశ్ ఈ సినిమాలో నటించనుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.