అయోధ్య రామాలయ నిర్మాణానికి గాను తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు రూ.1,01,116 విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలసి చెక్‌ను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రతినిధులకు అందజేశారు.
చెక్ తిరస్కరణ
కాగా, వారం క్రితం ఈ మొత్తాన్నే ఆయన రామతీర్థంలో శ్రీ కోదండరాముడి నూతన విగ్రహం తయారీ కోసం విరాళంగా ఇస్తూ చెక్‌తో పాటు ఓ లేఖనూ ఆలయ అధికారులకు పంపారు. తాను కేవలం భక్తి పూర్వకంగా మాత్రమే విరాళం ఇస్తున్నానని తెలిపారు. తాము ఆలయ నిధులతోనే విగ్రహాన్ని తయారు చేయిస్తున్నామని, బయటి నుంచి విరాళాలు తీసుకోవడం లేదని చెబుతూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆ చెక్‌ను తిరస్కరించింది. దీనిపై అశోక్ గజపతిరాజు తన ఆవేదన వెలిబుచ్చారు. ట్రస్ట్ నుంచి కనీస సమాచారం లేకుండా తనను ఛైర్మన్ పదవి నుంచి తొలగించారని, ఇప్పుడు విరాళం కూడా తిరస్కరించారని వ్యాఖ్యానించారు. చెక్ తిరస్కరణ ఇటు టీడీపీ నేత ల నుంచి, భక్తుల నుంచి విమర్శలు మొదలయ్యాయి.
Must Read ;- అశోక్ గజపతి విరాళం తిరస్కరణ.. రామతీర్థం కేంద్రంగా మరో వివాదానికి సర్కారు తెర
Now that I have been denied my right as a bhakta and a member of founder family to offer my donation to Lord Rama in Ramatheerthalu, I have passed on the donation which to my mind now belongs to Lord Rama to the Bhavya Ram Mandhir in Ayodhya. I am at peace now. pic.twitter.com/VgDwTlxWMl
— Ashok Gajapathi Raju (@Ashok_Gajapathi) January 26, 2021
ఆయన కోరుకున్నట్లే..
తాజాగా అయోధ్య రామాలయ నిర్మాణానికి అంతే మొత్తం చెక్కును అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ప్రతినిధులకు అందింని ఫొటోను ట్విట్టర్ లో పెట్టిన అశోక్ గజపతి రాజు ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ‘వ్యవస్థాపక కుటుంబీకుడి హోదాలో నేను రామతీర్థంలోని కోదండరాముడి విగ్రహ తయారీకి ఇచ్చిన చెక్కు తిరస్కరణకు గురైంది. అయితే నేను అనుకున్న సదరు మొత్తాన్ని అయోద్య రామాలయ నిర్మాణానికి విరాళంగా ఇవ్వడంతో నాకు మనశ్శాంతి’ లభించిందని వ్యాఖ్యానించారు. దీంతో సోషల్ మీడియాలోనూ అదే స్థాయిలో ఆసక్తికరమైన కామెంట్లు వస్తున్నాయి. ఆ డబ్బు రాముల వారికి చెందాల్సి ఉందని, అలాగే మీరు అనుకున్న ప్రకారం శ్రీరాముల వారికే చేరిందని కామెంట్లు కనిపిస్తున్నాయి.
వెల్లంపల్లి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు
వైసీపీ ప్రభుత్వం వచ్చాక సింహాచలం బోర్డు, మాన్సాస్ ట్రస్ట్‌తో పాటు పలు జిల్లాల్లో ఉన్న 120కి పైగా ఆలయాలకు వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించిన ప్రభుత్వం ఆ వంశానికి వారసురాలిగా తెరపైకి వచ్చిన సంచైతను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి అశోక్ గజపతిరాజుపై సంచైత తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. చివరికి విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మక శ్రీపైడితల్లి అమ్మావారి జాతరలోనూ అశోక్ గజపతి రాజు కుటుంబానికి అవమానం జరిగినట్టు ప్రచారం జరిగింది. కొన్నాళ్ల క్రితం రామతీర్థం సమీపంలోని కొండపై ఉన్న రామాలయంలోని కోదండరాముని విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ద్వసం చేసిన ఘటన రాష్ట్రంలో సంచనలం రేపింది. ఈ క్రమంలోనూ ఏపీ దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్‌లో అశోక్ గజపతిరాజుపై చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. జగన్ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపులో భాగంగానే రాజవంశీకుడైన అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేసిందనే విమర్శలు వస్తున్నాయి. అందులో భాగంగానే అశోక్ గజపతిరాజు పంపిన చెక్కును రామతీర్థం ఆలయ అధికారులు తిరస్కరించారని కామెంట్లు వచ్చాయి. తాజాగా అయోద్య రామమందిరానికి విరాళం ఇవ్వడంతో రాములవారికి ఇవ్వాల్సిన విరాళం రాములవారికే చెందిందనే చర్చ మొదలైంది.