సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోలవారసులే హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ కథానాయికల కుమార్తెలు చాలా తక్కువ మంది ప్రవేశించారు. అందులో కొందరే నిలదొక్కుకున్నారు. రాధ కూతురు కార్తీక, మంజుల కూతుళ్లు వనిత, శ్రీదేవి, దేవిక కూతురు కనక , లక్ష్మి కూతురు ఐశ్వర్య.. ఇప్పుడు మేనక కూతురు కీర్తి సురేశ్ హీరోయిన్స్ గా రంగ ప్రవేశం చేయగా.. ఇప్పుడు శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, జీవిత కుమార్తెలు శివానీ, శివాత్మికలు కథానాయికలుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ లిస్ట్ లోకి మరో హీరోయిన్ కూతురు కూడా వచ్చి చేరుతోంది. ఆమె రోజా కూతురు అన్షు మాలిక.
ప్రస్తుతం అన్షు .. కథానాయికగా ఎంట్రీ ఇచ్చేందుకు రోజా రంగం సిద్ధం చేసిందట. ఆమె ఇప్పుడు యాక్టింగ్ లోనూ, డ్యాన్స్ లో నూ శిక్షణ తీసుకుంటోందట. ప్రస్తుతం రోజా రెండు శస్త్ర చికిత్సలు చేయించుకొని హాస్పిటల్ లో ఉన్న సంగతి తెలిసిందే. తన కూతురిని ఎప్పటి నుంచో హీరోయిన్ గా పరిచయం చేయాలనుకుంటోంది రోజా. ఇప్పటికి ఆ ప్రయత్నం నెరవేరిందనే వార్తలొస్తున్నాయి.
ప్రస్తుతం రాఘవేంద్రరావు పెళ్ళిసందడి సీక్వెల్ మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో గా నటిస్తున్నాడు. కాగా.. అతడి సరసన కథానాయికగా అన్షు మాలికను పరిచయం చేయబోతోందట రోజా. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చూడ్డానికి అచ్చం తన తల్లి రోజాలాగానే కనిపిస్తోన్న అన్షు మాలిక ఫ్యూచర్ లో మంచి హీరోయిన్ అవుతుందేమో చూడాలి.











