ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన జవాన్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 22 మంది జవాన్లు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో 17 మంది జవాన్ల మృతదేహాలను గుర్తించారు. ఎదురుకాల్పుల్లో 31 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వాళ్లంతా బీజాపూర్, రాయ్‌పూర్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఎన్ కౌంటర్ ఘటనలో మొత్తం 21 మంది సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో ఏడుగురు సీఆర్పీఎఫ్‌కు చెందిన వారున్నారు. సీఆర్పీఎఫ్ డీజీ కులదీప్ సింగ్ ఆదివారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్నారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు.
తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్ ఎమోషనల్ పోస్ట్.!
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...











