ప్రస్తుతం అందమైన యాంకర్స్ కు వెండితెరమీద మంచి డిమాండ్ ఏర్పడింది. టీవీ షోస్ లో స్కిన్ షో చేయడంలో కాస్తంత స్మార్ట్ నెస్ ప్రదర్శిస్తున్న వారికే వెండితెరమీద అందలమెక్కే అవకాశమిస్తున్నారు. ఒక పక్క యాంకర్స్ గా సూపర్ పొజీషన్ లో ఉండగానే.. మరో పక్క సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ తమ కెరీర్ ను ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా లాగిస్తున్నారు. ప్రస్తుతం అనసూయ, రష్మి అందులో ఆరితేరిపోగా.. ఇప్పుడు ఆ ఇద్దరితోనూ పోటీ పడుతోంది శ్రీముఖి.
‘ప్రేమ ఇష్క కాదల్’ అనే మూవీతో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖి. అంతకు ముందే ఆమెకి ‘అదుర్స్’ అనే టీవీ షోలో యాంకర్ గా ఛాన్సొచ్చింది. ఆపై యాంకర్ గా కొనసాగుతునే .. మరో పక్క సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ రెండింట్లోనూ గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. దీనికి తోడు .. బిగ్ బాస్ 3లో రన్నరప్ గా క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె .. ‘క్రేజీ అంకుల్స్’ అనే మూవీలో కథానాయికగా నటిస్తోంది.
ఇక శ్రీముఖి.. సోషల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పనే అక్కర్లేదు. ఇన్ స్టాలో ఆమె తరుచు పోస్ట్ చేసే ఫోటోస్ కి బోలెడంత క్రేజ్. ఈ క్రెడిట్ తోనే ఆమెకి అక్కడ బోలెడంత ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమె ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా దానికి మంచి స్పందన లభించడం చెప్పుకోదగ్గది. తాజాగా శ్రీముఖి పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏదో వెకేషన్ కు వెళ్ళిన ఆమె అక్కడ ఒక వుడెన్ హట్ లో దిగిన ఫోటోస్ భలేగా ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ మీద వైట్ డిజైన్స్ కలిగిన డ్రెస్ లో ఆమె అప్సరసలా రివీలైంది. ఆ డ్రెస్ లో ఆమె హాట్ నెస్ కు బదులుగా క్యూట్ నెస్ గా కనిపించడం ఆకట్టుకుంటోంది.