నాలుగు పదుల వయసుకు అతి దగ్గరగా ఉంది ఆమె వయసు. అందులో ఆమె కెరీర్ వయసేమో 20 ఏళ్లు. అంటే ఆమె 20 ఏళ్ళకే హీరోయిన్ అయిపోయిందన్నమాట. అయితేనేం.. ఇప్పటికీ ఆమె అందంలో అణువంతమైన మార్పు రాలేదు. అదే రూపం, అదే లావణ్యం.. అదే ఎనర్జీ, అదే ఉత్సాహం. ఆమె పేరు శ్రియా శరణ్. నలభై ఏళ్ళకే తమ అందాన్ని పూర్తిగా కోల్పోయే కొందరు హీరోయిన్స్ జాబితాలోకి ఎప్పుడూ చేరని బ్యూటీ ఆమె.
2001 లో ఇష్టం సినిమాతో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది శ్రియా శరణ్. తొలి సినిమాతోనే క్యూట్ హీరోయిన్ గా మార్కులేయించుకున్న ఆమె అతి తక్కువ టైమ్ లో టాలీవుడ్ లోని అప్పటి అగ్ర కథానాయకులందరి సరసన నటించి మెప్పించిన సుందరి ఆమె. తమిళ, హిందీ భాషల్లో సైతం తన అందంతో మెప్పించింది. ఆ తర్వాత గ్లామరస్ బ్యూటీగా అవతరించి.. సత్తా చాటుకుంది. అయితే ఆమెలో ప్రత్యేకత ఏంటంటే.. 20 ఏళ్ళ నుంచి గ్యాపే లేకుండా ఇప్పటికీ నటిస్తూనే ఉంది. లేటెస్ట్ గా శ్రియా శరణ్ తన మనసుకు నచ్చినవాడ్ని మనువాడింది. అయినప్పటికీ సినిమాల్లో నటించడం మాత్రం మానలేదు.
ప్రస్తుతం శ్రియా శరణ్.. ఆర్.ఆర్.ఆర్, గమనం, నరకాసురన్, తడ్కా లాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. మరో పక్క సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన చేస్తూ.. ఓరేంజ్ లో ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. తాజాగా శ్రియా షేర్ చేసిన ఫోటోలు నెటిజెన్స్ ను నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా పింక్ నెట్ లాంటి డ్రెస్ లో ఆమె లోదుస్తులు బహిర్గతం అవుతున్నాయి. ఈ పిక్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇంత లేటు వయసులో , ఘాటు అందాల్ని ప్రదర్శించడం ఆమెకే చెల్లిందని ప్రశంసిస్తున్నారు. దటీజ్ శ్రియా శరణ్.