విమాన అదృశ్య వార్త అటు జకార్తాలో.. ఇటు పాంటియానక్ లోనూ కలకలం రేపుతుంది. ఇండోనేషియాలోని రెండు నగరాల మధ్య ప్రాయణిస్తున్న విమానం హఠాత్తుగా కనిపించకుండా పోయింది. జకార్తలో బయలుదేరిన ఎయిర్ బోయింగ్ 737 శ్రీవిజయ విమానం నాలుగు నిమిషాలలోనే విమాన స్నిగల్స్ ఏటీసీకి అందకుండాపోయాయి. ఎయిర్ లైన్స్ అందిస్తున్న సమాచారం ప్రకారం విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 59 మంది ఉన్నట్లు తెలుస్తుంది. ప్రయాణికులలో 5 గురు చిన్నారులు కూడా ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
సిగ్నల్స్ కోల్పోయిన అనంతం విమానం కూలి ఉండచ్చని స్థానిక మీడియా వార్తలు విడుదల చేసింది. రాడార్ స్నిగల్స్‌ని ఉపయోగించి విమానం జాడ కనుక్కోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇండోనేషియాలో జరిగిన ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.











