‘అరుంధతి, వేదం, పంచాక్షరి, బాహుబలి సిరీస్, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి’ లాంటి సినిమాలతో అందాల అనుష్క ఓ రేంజ్ లో అభిమానుల్ని సంపాదించుకుంది. అందం, అభినయం రెండింటిలోనూ అందెవేసిన చెయ్యి అనిపించుకున్న అమ్మడు… లేటెస్ట్ గా ‘నిశ్శబ్దం’ చిత్రంలో మూగ బధిర పాత్ర పోషించింది. సినిమా ఆశించినంత రీతిలో అలరించకపోయినా.. అందులో ఆమె నటన అభిమానుల్ని బాగానే ఆకట్టుకుంది.
నిన్న మొన్నటివరకూ గ్లామర్ రోల్స్ కన్నా మహిళా ప్రాధాన్యం కలిగిన పాత్రలకే అధిక ప్రాధాన్యతనిచ్చిన అనుష్క.. ఇప్పుడు ఆ పాత్రలమీద కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా అనుష్క మూడు విమెన్ సెంట్రిక్ మూవీస్ ను తిరస్కరించినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ సమాచారం ప్రకారం అనుష్క ఏడాదికి ఒక్క సినిమాలోనే నటించాలనుకుంటోందట. అదికూడా నిర్మాతలు, దర్శకులు ఆమె సన్నిహితులైతేనే సినిమా చేస్తుందట. సౌత్ లో టాప్ లిస్ట్ లో ఉన్న అమ్మడు .. ఈ రకమైన నిర్ణయం తీసుకోనుండడం అభిమానులకు షాకింగ్ గా ఉంది. మరి అనుష్క తన అదే నిర్ణయం మీద ఎంత వరకూ నిలబడుతుందో చూడాలి.
Must Read ;- గ్లామర్ బ్యూటీ.. ‘సూపర్’ స్వీటీ అనుష్క