సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ వడ్డీ ఓం ప్రకాష్ నారాయణ సెన్సార్ బోర్డ్ సభ్యునిగా ఎంపికయ్యారు. 1989 లో జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు ఆయన. సూపర్ హిట్, వార్త, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఏబియన్ ఛానల్ లో ఫిల్మ్ జర్నలిస్ట్ గానూ, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ లో సభ్యుడిగా ఉన్న అనుభవంతో ఆయనకి ఈ అరుదైన అవకాశం దక్కింది.
కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ..ఓం ప్రకాశ్ నారాయణను హైద్రాబాద్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్ గా నేడు ప్రకటించింది. ప్రస్తుతం యన్. టీవీలో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్న ఓం ప్రకాష్ నారాయణ .. తన ఎంపిక పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.











