బాలీవుడ్ లో ఆలియా భట్ బెస్ట్ పెర్ఫార్మర్ అన్న సంగతి తెలిసిందే. గ్లామర్ ప్లస్ యాక్టింగ్ టాలెంట్ నిండుగా మెండుగా కలిగిన అమ్మడు.. ప్రస్తుతం టేకప్ చేసినవన్నీ హై రేంజ్ చిత్రాలే. ఒకపక్క సంజయ్ లీలా భన్సాలీ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘గంగూభాయ్ కతియావాడి’ మూవీ.. కామాటిపురలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. మరో పక్క దర్శకధీరుడు రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ లో రామ్ చరణ్ పోషిస్తోన్న రామరాజు పాత్ర సరసన సీతగా అభినయిస్తోంది.
ఆలియా లాక్ డౌన్ కు ముందు .. ‘ఆర్.ఆర్.ఆర్’ కు సంబంధించిన కొన్ని సీన్స్ లో నటించింది. ఆ తర్వాత ఏడునెలలు గ్యాప్ రావడంతో .. ఈ సినిమాను తిరిగి సెట్స్ మీదకు తీసుకెళ్ళారు. అమ్మడు ఇప్పుడు బ్యాలెన్స్ సీన్స్ షూట్ కోసం హైద్రాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఆలియా భట్ ఒక పాట కూడా పాడుతోందట.
నిజానికి ఆలియా భట్ బెస్ట్ సింగర్ . గతంలో ఆమె ‘హైవే, హంప్టీ శర్మ కీ దుల్హనియా’ లాంటి బాలీవుడ్ మూవీస్ కోసం గళం విప్పింది. ఆమె పాటలకు మంచి ప్రశంసలు సైతం దక్కాయి. ఇక ఇందులో రామ్ చరణ్, ఆలియా భట్ లపై ఒక సాంగ్ కూడా ఉందట. సో.. మొత్తానికి ఆలియా భట్ ఒక తెలుగు సినిమాలో నటిస్తూండడంతో పాటు .. ఇందులో ఒక పాటను సైతం పాడడం ఆసక్తిని రేపుతోంది. మరి ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి ఆలియా భట్ పాట ఏ మేరకు హైలైట్ అవుతుందో చూడాలి.











