బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ నటీమణి రియా చక్రవర్తి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు నెలరోజుల తర్వాత ఆమె రిమాండ్ కి బెయిల్ మంజూరు చేసింది బాంబే హైకోర్ట్. ప్రత్యేక షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్ట్ .. రియాను ముంబై వదిలి వెళ్లద్దని కండీషన్స్ పెట్టింది. ఇక ఆమె సోదరుడు సోవిక్ రిమాండ్‌ను అక్టోబర్ 20 వరకు పొడగిస్తూ ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబర్ 8నుంచి రియా చక్రవర్తి జైల్లోనే ఉంది. సెప్టెంబర్ 30న ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వులో ఉంచింది. బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానానికి ఎన్సీబీ విజ్ఞప్తి చేసింది.
బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సుశాంత్‌కు డ్రగ్స్ సరఫరా చేయడంలో రియా హస్తం ఉందని స్పష్టం చేసింది. రియా, ఆమె సోదరుడు డ్రగ్స్ సరఫరా చేశారని, అది తీవ్రతరమైన నేరమని కోర్టుకు తెలిపారు. దాదాపు 18 పేజీల అఫిడవిట్‌ను ఎన్సీబీ సమర్పించింది. ఏన్‌సీబీ వాదనతో ఏకీభవించిన కోర్టు రియాకు బెయిల్ ఇస్తూ…ఆమె సోదరుడు సోవిక్ రిమాండ్‌ను అక్టోబర్ 20వరకు జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ ఇవాళ తీర్పునిచ్చింది.