(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రత్యేక ప్రతినిధి)
అమరావతి రాజధానికి తీవ్ర అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వమే. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానికి మద్దతు పలికిన జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే అమరావతిని మూడు ముక్కలు చేస్తున్నట్టు ప్రకటించారు. అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని లేదంటే మరోసారి రాష్ట్రం ముక్కలయ్యే ప్రమాదం ఉందని సీఎం సమర్ధించుకున్నారు.
అసలు విషయం మాత్రం అందరికీ తెలిసిందే. అమరావతి రాజధానిలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని వైసీపీ నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అక్కడే రాజధాని అభివద్ధి చెందితే సహజంగానే అక్కడ భూములున్న వారు కోటీశ్వరులు అయిపోతారు. టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొన్నారని వైసీపీ భావిస్తోంది. రాజధాని అక్కడే అభివృద్ధి చేస్తే 2014 ఎన్నికల నాటికి టీడీపీకి ఆర్థిక వనరులు రాజధాని భూముల ద్వారానే లభిస్తాయి. అలా జరగకుండా చేయాలనే ఉద్ధేశంతోనే అమరావతి రాజధానిని ముక్కలు చేశారన్నది బహిరంగ రహస్యమే.
అమరావతి ఎందుకు జై కొట్టారు?
మొదటి నుంచీ రాజధానికి 33 వేల ఎకరాలు ఉండాల్సిందేనని, అమరావతిలో రాజధాని తమకు సమ్మతమేనని వైసీపీ ప్రచారం చేస్తూనే ఉంది. 2019 ఎన్నికల్లో కూడా ఆ పార్టీ మ్యానిఫెస్టోలో ఎక్కడా మూడు రాజధానుల ప్రస్తావన రాలేదు. ఎన్నికలు అయిపోయాక అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్మోహన్ రెడ్డి బాంబు పేల్చారు. రాజధానిని మూడు ముక్కలు చేస్తున్నట్టు ప్రకటించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకే అలా చేస్తున్నట్టు సమర్థించుకున్నారు కూడా. అసలు విషయం అందరికీ తెలిసిందే. మూడు రాజధానులు పెడితే అన్ని ప్రాంతాలు వృద్ధి చెందుతాయని భావించడం అపోహే. అన్ని జిల్లాల్లో పెట్టుబడులు పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు వస్తేనే అన్నీ ప్రాంతాల్లో ఉపాధి లభిస్తుంది. తద్వారా అన్ని ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందుతారు.
వైసీపీ, బీజేపీ మూడు ముక్కలాట…
అమరావతి రాజధానికి పీఎం నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. అయినా బీజేపీ ఏపీ నేతలు తలో మాట మాట్లాడుతున్నారు. రాజదాని అంశం రాష్ట్ర పరిధిలోకి వస్తుందని కేంద్రానికి సంబంధం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ ఎంపీ జీవీఎల్ కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. మరికొందరు బీజేపీ నేతలు సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ అమరావతిలోనే రాజధాని ఉండాలని కోరుకుంటున్నారు. ఇందులో బీజేపీ నేతల కొందరు వైసీపీకి అనుకూలంగా మరికొందరు, ప్రతిపక్షానిని అనుకూలంగా మాట్లాడుతున్నారనే అనుమానాలు వస్తున్నాయి. ఏది ఏమైనా అమరావతి రాజధాని ప్రాణం తీయడంలో వైసీపీ ప్రభుత్వమే కీలకపాత్ర వహించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రాజధానికి విశాఖ అనుకూల ప్రదేశమేనా?
ఏపీలో అభివృద్ధి చెందిన ఏకైక పెద్ద నగరం విశాఖ. ఇప్పటికే విశాఖలో 40 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. వారికి ఇప్పటికీ కనీస సదుపాయాలు లేవు. పారిశ్రామికంగా దూసుకుపోతున్న నగరాల్లో విశాఖ నగరం ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సముద్రతీర నగరం కావడంతో అక్కడ తుపానుల గండం కూడా ఉంది. హుదూద్ తుపాను దెబ్బకు విశాఖ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే . అలాంటి ప్రాంతంలో రాజధాని పెట్టడం సురక్షితం కాదని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. పోర్టు నుంచి, ఫార్మా కంపెనీల నుంచి వచ్చే కాలుష్యంతోనే విశాఖ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక రాజధాని పెడితే పరిస్థితి మరింత చేయదాటవచ్చని విశాఖ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.











