టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోగా మారిపోయాడు నాని. ప్రస్తుతం ‘టక్ జగదీష్’ సినిమాలో నటిస్తున్నాడు. ‘నిన్నుకోరి’, ‘మజిలీ’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది సినిమా. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇటీవల ఈ సినిమాను తిరిగి సెట్స్ పైకి తీసుకువెళ్లారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
నిజానికి ‘టక్ జగదీష్’ సినిమా సెట్ లో ఓ టెక్నిషియన్ కు కరోనా రావడంతో షూటింగ్ కు మళ్ళీ బ్రేక్ పడుతుందా అని అందరూ భావించారు. అయితే అలాంటిదేమీ లేకుండానే షూటింగ్ ను కంటిన్యూ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. షూటింగ్ లో అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తున్నామని చిత్ర బృందం తెలిపింది. టెక్నీషియన్ కు కరోనా రావడంతో అతడిని కాంటాక్ట్ అయిన వారికి టెస్టులు నిర్వహించినట్టు వారు తెలిపారు.
తాజాగా ‘టక్ జగదీష్’ షూటింగ్ స్పాట్ లో కరోనా యాంటీ స్ప్రే చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది చిత్ర యూనిట్. ఇదిలా ఉండగా నాని మాత్రం ఈ సినిమా షూటింగ్ లో ఫుల్ జోష్ తో పాల్గొంటున్నాడని వారు తెలిపారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేద్దామని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా క్లీన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని సమాచారం. నాని సినిమా అంటేనే కామిడీ, ఎమోషన్స్ బలంగా ఉంటాయి. ఈ సినిమాపై నాని అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ద్వారా నాని తన అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి మరి.











