రాధాపై ఎందుకంతా ప్రేమ..!
మహానేత వంగవీటి రంగా జయంతి సందర్భంగా కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం చినగొన్నూరులో జరిగిన కార్యక్రమాల్లో వంగవీటి రాధా, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లు ముగ్గురు ఒకే వేదికను పంచుకున్నారు. ఈ క్రమంలో రాధా సంచలన కామెంట్స్ చేశారు. తనను ఏదో చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, నన్ను ఎవరూ ఏమీ చేయలేరని, ఎవరకీ భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. తనను చంపేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారని, పొట్టన పెట్టుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని రాధా ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసిన రంగా తనయుడిగానే జనంలో ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కసారి అలర్ట్ అయ్యింది. తక్షణమే రాధా భద్రతను పెంచుతూ.. ఉత్తర్వులు ఇచ్చారు. ఈ క్రమంలో నాకు గన్ మెన్లన్లు వద్దు ప్రజలతోనే ఉంటాను. నాకు రంగా సైన్యం చాలు.. అని రాధా సున్నితంగా తిరస్కరించాడు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న రాధాను వైసీపీలోకి తిరిగి రావాలని ఎప్పటీనుంచో ఆయన స్నేహితులైన కొడాలి, వల్లభనేని లు ప్రపోజల్స్, ఆఫర్స్ బాగానే ఇస్తున్నారు. అయితే గతంలో వైసీపీలో సముచిత స్థానం ఇవ్వకపోవడం కారణంగా రాధా పార్టీని వీడి టీడీపీలో చేరి మద్దతుదారుడిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో రాధా చేసిన వ్యాఖ్యలను అధికారపార్టీకి అనుకూలంగా మల్చుకుని పావులు కదుపుతోంది వైసీపీ!
గన్‌మెన్స్ వద్దు.. రెక్కి ఎవరు నిర్వహించో తెలుసు..!
ప్రభుత్వం ఇచ్చిన గన్మెన్లను తిరష్కరించిన వంగవీటి రాధా .. తనను చంపేందుకు రెక్కి నిర్వహించిన వాళ్లెవరో తెలుసన్నారు. అభిమానులు, అనుచరులు తనకు రక్షగా ఉంటారని చెప్పారు. అన్ని పార్టీల నేతలు తనకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారని చెప్పారు. రెక్కి నిర్వహిస్తున్న వారి సమాచారం నాకన్నా.. ఎక్కువగా పోలీసు అధికారులు వద్దే ఉందని కౌంటరిచ్చాడు. ఈ కామెంటే అధికార పార్టీ రాధా మరోసారి సవాల్ విసిరారు! అయితే ప్రస్తుతం రాధా చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా మరోసారి వైరల్ అయ్యాయి. టీడీపీలో కొనసాగుతున్న రాధాను చంపేందుకు ఎవరు కుట్రపన్నుతున్నారు? అంత అవసరమేమిటి? ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది! మరో వైపు రాధా కామెంట్స్ తో జగన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒక్కసారి అలర్ట్ మోడ్ లోకి వచ్చేసింది!
Must Read ;- రాధా మర్డర్‌కు కుట్రలు..! వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే..!- చంద్రబాబు