మళయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ మరో తాజా సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లు లేనందున ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఫాహద్ ఫాజిల్ మళయాళంలో అంచెలంచెలుగా ఎదిగారు. ఇందులో కూడా దర్శనా రాజేంద్రన్ ఆయన పక్కన నటించింది. సెప్టెంబరు 1న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతుంది. ఫాజిల్ సినిమా ప్రేమికులు మాత్రం ఈ సినిమా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా లాక్ డౌన్ సమయంలో ఎవరూ సినిమాల్లో నటించడంలేదు.
కానీ మలయాళ ఇండస్ట్రీలో ఓ బృందం ఈ పరిస్థితిని ఛాలెంజ్‌గా తీసుకుంది. లాక్‌డౌన్ సమయంలోనే ఓ సినిమాని ప్రారంభించి పూర్తి చేసింది కూడా. ఇందులో ఫాహద్ ఫాజిల్, రోషన్ మాథ్యూస్, దర్శనా రాజేంద్రన్ ముఖ్య పాత్రలు పోషించారు. మహేశ్ సి. నారాయణ్ దర్శకత్వంలో ‘సీ యూ సూన్’ తెరకెక్కింది. 70 నిమిషాల నిడివి ఉండే ఈ సినిమాను పూర్తిగా ఐ ఫోన్‌లో చిత్రీకరించడం మరో విశేషం. చిత్రీకరణ మొత్తం లాక్‌డౌన్ సమయంలోనే అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ షూటింగ్ పూర్తిచేశారట. ఇన్ని ప్రత్యేకతలున్నా ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఏటికి ఎదురీది సినిమా తీయడం అంటే ఇదే.