గత నాలుగేళ్లుగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని దూరం పెట్టిన కాషాయ దళం.. సడెన్ గా ఎందుకు హస్తినకి రావాలని కబురు పంపింది.?? బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా చంద్రబాబు నాయుడుతో సుమారు గంటపాటు ఏం చర్చించారు?? ఈ భేటీ ఏపీ, తెలంగాణ రాజకీయాలలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించనుంది?? రాబోయే కొద్ది రోజుల్లో ఈ సమావేశం ఎలాంటి పరిణామాలకు దారి తీయనుంది?? ఇదే ఇప్పుడు తెలుగు రాజకీయాలను కుదిపేస్తోంది..
టీడీపీ, బీజేపీ మధ్య గత కొంతకాలంగా సరైన సఖ్యత లేదనేది ఓపెన్ సీక్రెట్.. 2019 ఎన్నికలలో ఓటమి తర్వాత చంద్రబాబును కాషాయ దళం పూర్తిగా పక్కన పెట్టేసింది.. ఇటు టీడీపీ అధినేత సైతం ఆ పార్టీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.. మరోవైపు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని ప్రధాని మోదీ దత్తపుత్రుడిగా భావిస్తున్నారనే చర్చ సాగుతోంది.. ఆయనకు పరోక్షంగా సాయం అందిస్తోంది బీజేపీ అధిష్టానం.. ఏపీలో అరాచక పాలన సాగిస్తున్నా, ఆర్ధికంగా దివాళా తీసే విధానాలు అనుసరిస్తున్నా, శాంతి భద్రతలను తన స్వప్రయోజనాల కోసం పణంగా పెడుతున్నా.. జగన్ సర్కార్ ని కిమ్మనలేదు కేంద్రం.. అంతేకాదు, ఏపీ ముఖ్యమంత్రికి భారీగా నిధులు అందజేసి, టీడీపీ పతనానికి సహకరిస్తున్నారనే ప్రచారమూ ఉంది..
తాజాగా చంద్రబాబు – అమిత్ షా, జేడీ నడ్డా భేటీలో ఈ అంశాలపైనే ప్రధాన చర్చ సాగిందట.. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాషాయ దళం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. దేశవ్యాప్తంగా తమకు తీవ్ర వ్యతిరేక పవనాలు వీయడం ఖాయంగా కనిపిస్తోందనే సంకేతాలు వెలువడుతున్నాయి.. తాజాగా మహారాష్ట్రలో ప్రముఖ సర్వే సంస్థ సకల్ చేసిన లేటెస్ట్ సర్వేలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి భారీ విజయం అందుకోనుందనే రిపోర్టులు కాషాయ దళం గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తున్నాయి..
ఇటు కర్నాటక ఎన్నికల ప్రకంపనలు తెలంగాణనూ తాకాయి.. తెలంగాణలో నిన్నమొన్నటివరకు ఎంతో బలీయంగా కనిపించిన కాషాయ దళం రేకులు వాడిపోతున్నాయి.. ఆ పార్టీలోకి చేరికలు ఆగిపోయాయి.. తాజాగా రివర్స్ అయ్యేలా ఉంది సీన్.. బీజేపీ నుండి జంప్ చేయడానికి అనేకమంది నేతలు రెడీ అవుతున్నారు..
ఇలాంటి పరిస్థితులలో బీజేపీకి నమ్మదగిన మిత్రుడుగా కనిపించారట ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణతోపాటు ఏపీలోనూ పొత్తులపై ఇరు పార్టీల నేతల మధ్య చర్చల సాగాయట.. అయితే, బీజేపీతో అలయెన్స్ కి చంద్రబాబు నో చెప్పారట.. ఇది సరయిన సమయం కాదని, ముందుగా ఏపీలో జగన్ కి బీజేపీ దూరం జరగాలని, వైసీపీకి షాక్ ఇచ్చేలా బీజేపీ వ్యవహరించాలని షరతులు పెట్టారట..
చంద్రబాబు సూచనలకు వెంటనే రియాక్ట్ అయ్యారట కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా.. తమకు జగన్ పై అభిమానం, ప్రేమ ఏమీ లేవని, కేవలం రాజ్యసభలో సంఖ్యాబలం, మద్దతు కోసమే తాము వైసీపీతో సానుకూలంగా ఉంటున్నామని గుర్తు చేశారట.. గత నాలుగేళ్లలో రాజ్యసభలో జగన్ సహకారంతో అనేక బిల్లులని గట్టెక్కించుకున్నట్లు గుర్తు చేశారట అమిత్ షా..
అయితే, చంద్రబాబు సూచనలని తాము తక్షణమే అమలు చేస్తామని, రాబోయే వారం పది రోజుల్లో జగన్ టీమ్ కి వరసగా ఝలక్ లు తగలడం ఖాయంగా కనిపిస్తాయని హామీ ఇచ్చారట అమిత్ షా.. ముందుగా తెలంగాణలో టీడీపీ – బీజేపీ బంధంపై క్లారిటీ రావాలన్నా.. తన సలహాలు, షరతులు పాటించాలని కోరారట చంద్రబాబు. వీటికి అమిత్ షా సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుగు రాజకీయాలలో చర్చ సాగుతోంది..
ఇదే ఇప్పుడు జగన్ టీమ్ ని కలవరపెడుతోంది.. సైకిల్ – కమలం దోస్తీ సెట్ అయితే, అది తమను నిలువునా ముంచడం ఖాయమనేది తాడేపల్లి ప్యాలెస్ బలీయమైన నమ్మకం.. చంద్రబాబుతో మోదీ – అమిత్ షా టీమ్ జత కలిస్తే తాడేపల్లి ప్యాలెస్ కి సీన్ సితార్ కావడం ఖాయం.. అందుకే, చంద్రబాబు – అమిత్ షా భేటీపై అనేక అవాకులు చెవాకులు పేలుతోంది… జగన్ నీలి, కూలి మీడియా.. ఆ భయం, టెన్షన్, వారి రాతలు, విశ్లేషణలలోనే స్పష్టంగా కనిపిస్తోంది.. మరి, జగన్ కి బీజేపీ హై కమాండ్ ఇవ్వబోయే తొలి ఝలక్ ఏంటనేది హాట్ టాపిక్ గా మారుతోంది.