ఉగ్రవాదులు, మావోల కేసుల్లో అనుసరించాల్సిన విధానాలు.. విమర్శకులపైనా?
ఏపీలో అధికార పార్టీ ఆగడాలను ప్రశ్నించినా .. విమర్శించినా.. ఇళ్లపై దాడులు జరిగుతాయి అంతే…! తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ .. గత వారం రోజులుగా సాగుతున్న ప్రభుత్వ దౌర్జన్యకాండ శృతిమించుతోంది. నోటీసులు, అరెస్ట్ లు .. బెదిరింపు చర్యలు ఒక లెక్కయితే … ఈ రోజు అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహిళా నేతల ఇళ్లపై కార్డన్ సెర్చ్ పేరుతో కారు, నగలను సీజ్ చేయడం దారుణం. ఈ తనిఖీల్లో మీడియాపై కూడా ఆంక్షలు విధించడం పలు విమర్శలకు దారితీస్తోంది.
భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం .. పోలీసు చర్యలు!
రాష్ట్రంలో ప్రతిపక్షంతోపాటు మీడియా గొంతును జగన్ రెడ్డి ప్రభుత్వం నొక్కేస్తోంది. ప్రశ్నించినా, విమర్శించినా అదేదో దేశ ద్రోహంలా భావిస్తూ .. పలు సెక్షన్ల కేసులు నమోదు చేస్తున్నారు. ఇదెక్కడి సాంప్రదాయమే కానీ … విమర్శలు స్వీకరించలేనంత సెన్సీటివ్ మైండ్ తో ఉన్న సీఎం రాష్ట్రానికి దొరకడం దౌర్భాగ్యమని విమర్శకులు వాపోతున్నారు. ఉన్నది లేనట్లు .. లేనిది ఉన్నట్లు .. చేస్తున్నది చేయనట్లు .. చేయనిది చేస్తున్నట్లు వంటి వాటిపై విమర్శలు, ప్రోటోకాల్ పాటించకుండా మంత్రులను, ప్రజాప్రతినిధులను, అధికారులను పట్టుకుని పరుష పదజాలంతో దూషింస్తే .. కేసులు కట్టి లోపల వేయడం సర్వసాధరణం. కానీ ప్రభుత్వ వైఫల్యాలను, చట్టసభల్లో సభ్యత లేకుండా చేస్తున్న దిగజారుడు రాజకీయాలను విమర్శిస్తే … ఏపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు కడు ఆక్షేపనీయం. నవంబర్ 19న ఏపీ అసెంబ్లీలో భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా అధికారపార్టీ నేతలు చేసిన కామెంట్స్ పై రాష్ట్రంలోని టీడీపీ నాయకులు భగ్గుమన్నారు. సాంప్రదాయాలా కట్టుబాటు, విలువలతో కూడిన పెరిగిన గృహిణి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. రాజకీయాలకు సంబధం లేని అటువంటి వ్యక్తిపై దూషణలకు పాల్పడటం తగదు అని మీడియా ముఖంగా వ్యాఖ్యలు చేసిన కారణంగా అనంతపురం జిల్లాలోని టీడీపీ మహిళా నేతలపై ప్రభుత్వ వేధింపులు ప్రారంభమయ్యాయి.
దాడులు కావు .. దౌర్జన్యం !
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి పై జరిగిన అధికార మాటల దాడిని ఖండిస్తే పోలీసులు చర్యలు తీసుకోవడం నేడు అనంతపురం జిల్లా చర్చనీయాంశంగా మారింది. అనంతపురంలో టీడీపీ మహిళా రాష్ట్ర నేతలు స్పప్న, విజశ్రీ ఇళ్లపై పోలీసులు దాడి చేసి, సోదాలు నిర్వహించారు. బంగారు నగలు, నగదు, సెల్ ఫోన్లు, కార్ ను సీజ్ చేశారు. ఎటువంటి సెర్చ్ వారెంటీ లేకుండా సోదాలు, సీజ్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించినా .. పోలీసుల నుంచి ఎటువంటి సమాధానం లేదు. దాడులకు భయపడేది లేదని, ప్రశ్నించిన వారిపై కేసులు పెడితే.. రాజ్యాంగ పరంగా ఏవిధంగా ముందుకు పోవాలో తెలుసునని హెచ్చరించారు టీడీపీ రాష్ట్ర మహిళా నేత స్వప్న. ఇదిలా ఉంటే మహిళా నేతలపై అధికార పార్టీ పాల్పడిన దౌర్జన్యాలను ఖండిస్తున్నారు.











