మార్గని భరత్ రామ్ ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్నారు. 2019 ఎన్నికలలో ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. పోటీ చేసిన తొలిసారే ‘స్టాల్ వాల్ట్స్’ మాగంటి మురళీమోహన్ కోడలు రూపను ఓడించి పార్లమెంట్ లో అడుగుపెట్టడంతో అందరి దృష్టిని ఆకర్శించారు. పార్లమెంట్ చర్చల సమయంలోనూ తన పాత్ర చక్కగా పోషించి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నుంచి ప్రశంసలు కూడా దక్కించుకున్నారు. యువకుడు కావడంతో అందరిని కలుపుకొని ముందుకు పోతున్నాడని ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉండే ఆయన ప్రతి విషయంపై స్పందిస్తుంటారు. నాణేనికి ఇది ఒక వైపు మాత్రమే. మరోవైపు తాజాగా ఆయన చేసిన ట్వీట్ వివాదం రేపింది.
ట్వీట్ లో ఏముంది
బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండంతో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక సంవత్సరంలో కురవవలసిన వాన 24 గంటలలోనే కురవడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ‘విశ్వనగరం’గా చెబుతున్న హైదరాబాద్, ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన క్యాపిటల్ సీటీ వైజాగ్ కూడా ముంపుకు గురయింది. ఈ విషయాన్ని పట్టించుకోని రాజమండ్రి ఎంపీ మార్గని భరత్ రామ్ అమరావతి నీట మునిగిందంటూ ట్వీట్ చేశారు. దీనినేనా మార్చొద్దు అంటుంది అన్నీ ఇక్కడే వుండాలా !! గట్టిగా వరదలు వస్తే రాష్ట్ర రాజధాని అని చెప్పుకోవడానికి పేరు కూడా ఉండదు అంటూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ చేశారు.
అక్కడే అసలు తిరకాసు
ఆయన చేసిన ట్వీట్ మిస్ ఫైర్ అయిందనే చర్చ జరుగుతోంది. గుంటూరు జిల్లా అమరావతి గ్రామంలోని ఫోటోని తీసుకొని దానిని రాజధాని ప్రాంతమంటూ ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ట్వీట్ చేయడమేంటని సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. 29 గ్రామాలను కలిపి చంద్రబాబు ‘అమరావతి’ పేరిట రాజధానికి శ్రీకారం చుట్టారు. రాజధాని ‘అమరావతి’కి గుంటూరు జిల్లా అమరావతి గ్రామానికి మధ్య దూరం 21 కిలోమీటర్లు. ఇంత భారీ వర్షాలు కురిసినా రాజధాని ‘అమరావతి’ ప్రాంతం ముంపుకు గురి కాలేదు. కానీ ఈ విషయాన్ని మర్చిపోయి భరత్ రామ్ ఇలా ట్వీట్ చేయడమేంటనే చర్చ జరుగుతోంది.
ఎంపీ గారూ ఇప్పటికైనా ఈ ట్వీట్ ను డిలీట్ చేయమని నెటిజన్స్ కోరుకుంటున్నారు.
https://twitter.com/BharatYSRCP/status/1316248236974239744











