హైదరాబాద్ ఎక్సైజ్ కాలనీలో దంత వైద్యుడు హుస్సేన్ నిన్న సాయంత్రం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీంతో అప్రమత్తం అయిన సైబరాబాద్ పోలీసులు అన్ని చెక్ పోస్ట్ లను అలర్ట్ చేశారు. దీంతో అనంతపురం జిల్లాలో అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేసిన ఎస్పీ సత్యయేసుబాబు.
కిడ్నాపర్లు అనంతపురం మీదుగా బెంగళూరు వెళ్తుండగా మరూర్ టోల్ గేట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో కిడ్నాపర్లతో పాటు వైద్యున్ని గుర్తించి విడిపించిన పోలీసులు.
ఇద్దరు దుండగులు పరారీ..
ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోనికి తీసుకున్న రాప్తాడు పోలీసులు. నిందితులు ఉపయోగించిన రివాల్వర్, కత్తి, మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
ఎందుకు చేశారో తెలియదు: డాక్టర్ హుస్సేన్
హైదరాబాద్ ఎక్సైజ్ అకాడమీ వద్ద క్లినిక్ నుంచి నన్ను కిడ్నాప్ చేశారు. తొలుత ఓ గదిలో నిర్భందించారు. కాళ్లు, చేతులు కట్టేసి, మోహాన్ని కప్పేసి తీసుకెళ్లారు. ఎందుకోసం కిడ్నాప్ చేసారో తెలియదు.











