మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన రెండు రీమేక్ సినిమాలను చేయనున్న సంగతి కూడా విదితమే. అందులో మలయాళ ‘లూసిఫర్’ సినిమాకు వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, ఆకుల శివ రైటర్ గా పని చేస్తున్నాడు. ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథను రెడీ చేసాడు వినాయక్. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది సంక్రాంతికి సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇప్పుడు ఈ సినిమాపై ఒక వార్త టాలీవుడ్ లో చక్కెర్లు కొడుతోంది. అదేమిటంటే ‘లూసిఫర్’ రీమేక్ లో రానా నటిస్తున్నాడట. ఇందులోని ద్వితీయార్థంలో ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుంది. హీరోకు ఆపాత్ర అనేక రకాలుగా సహాయం చేస్తుంది. ‘లూసిఫర్’ ఒరిజినల్ లో అది చాలా బలమైన పాత్ర. మలయాళంలో ఆ పాత్రను డైరెక్టర్, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చేయడం జరిగింది. తెలుగులో కూడా ఈ పాత్రకు ఒక పెద్ద హీరోను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. పృథ్వీరాజ్ పాత్రకు రానా అయితే సరిగ్గా సరిపోతాడని దర్శకుడు వినాయక్ ఆలోచన.
ఇప్పటికే ఈ విషయాన్ని చిరుకు దర్శకుడు వినాయక్ తెలిపాడని, చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. మరి మెగాస్టార్ తో నటించే ఛాన్స్ ను రానా సద్వినియోగం చేసుకుంటాడో లేదో చూడాలి. అలాగే రానా, పవన్ కళ్యాణ్ నటించబోతున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ లో కూడ ఒక ప్రధాన పాత్ర చేస్తునట్టు వార్తలొస్తున్నాయి. ఇటు అన్నయ్య సినిమాలోనూ, అటు తమ్ముడు సినిమాలోనూ రానా నటిస్తున్నాడన్న వార్తలు ఇప్పుడు టాలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే రానా స్వయంగా స్పందించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.











