కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. 45 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. కేంద్రం ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల్లో 45 ఏళ్లు పైబడివాళ్లు వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. తెలంగాణలో 45 ఏళ్లు పైబడిన వారు 80 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ వ్యాక్సిన్ అందించేందుకు వైద్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఏపీ విషయానికి వస్తే పట్టణాల్లో పీహెచ్సీల్లో, గ్రామీణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు.
జగన్ దంపతులకు వ్యాక్సిన్
ఏపీ సీఎం జగన్ గురువారం ఉదయం సతీమణి వైఎస్ భారతితో కలిసి వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుంటూరులోని భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయంలో ముఖ్యమంత్రి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అబ్జర్వేషన్ తర్వాత తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
Also Read:నరహంతక సీఎం జగన్.. టీడీపీ నేత యరపతినేని











