వైసీపీ నేతల అవినీతి, అరాచకాలను అడ్డుకుంటోన్న టీడీపీ కార్యకర్తలు, నేతలను దారుణంగా చంపేస్తున్నారని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం నరహంతక సీఎంగా మారారంటూ యరపతినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా లక్కరాజుగార్లపాడులో వైసీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందతూ చనిపోయిన కృష్ణారావు కుటుంబసభ్యులను టీడీపీ నేతలు వర్లరామయ్య, యరపతినేని, జీవీ ఆంజనేయులు పరామర్శించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే విఘాతం కలిగిస్తున్నారని యరపతినేని తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులు అడ్డగోలుగా వెళితే తగిన సమయంలో గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు.
ఏపీ బీహార్‌ను మించిపోయింది
ఏపీలో నరహంతక పాలన నడుస్తోందని, బీహార్‌ను మించిపోయిందని యరపతినేని ధ్వజమెత్తారు. జైలులో 16 నెలలు ఉండి వచ్చిన సీఎం జగన్ అందరినీ జైలుకు పంపాలని చూస్తున్నాడంటూ టీడీపీ నేతలు విమర్శలు చేశారు. ఇలాంటి నియంతలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని యరపతినేని విమర్శించారు. చంద్రబాబు స్టే తెచ్చుకోవడంపై చదవులేని మంత్రి కొడాలి మాట్లాడటం విడ్డూరంగా ఉందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.
Must Read ;- జగన్ మరింత స్పీడు అవుతారా.. మున్ముందు మరింత దారుణం?