ఎన్నో ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ అందించారు. బుధవారం తెలంగాణ ఉద్యోగులు సీఎం జగన్ ను కలిశారు. ’’ఉద్యోగాలేమో ఆంధ్రప్రదేశ్ లో, కుటుంబాలు మాత్రం తెలంగాణలో ఉన్నాయని, దీంతో కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వస్తోందని‘‘ ఉద్యోగులు తమ సమస్యలను సీఎంకు విన్నవించుకున్నారు. సానుకూలంగా స్పందించిన ఆయన తెలంగాణకు బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు. హమీ ఇవ్వడమే కాకుండా, వెంటనే ఆదేశాలు కూడా జారీ చేశారు.
ఎన్నాళ్లో వేచిన ఉదయం
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపు ఏడేళ్లు గడుస్తున్నా.. ఉద్యోగుల విభజన మాత్రం అలాగే ఉండిపోయింది. గతంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించడంతో, పలువురు ఉద్యోగులు ఆయా రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. ఇంకా 711 మంది ఉద్యోగులు అలాగే ఉండిపోయారు. జగన్ తీసుకున్న నిర్ణయంతో ఏపీలోని ఆ ఉద్యోగులు తెలంగాణకు రానున్నారు. ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- సీఎంకు సారాభిషేకం : రిటైర్మెంట్ వయస్సు పెంపుపై నిరుద్యోగుల భగ్గు











