5 ఏళ్లగా మూతపడిన అన్నా క్యాంటీన్లు ఇప్పుడు సరికొత్తగా తెరుచుకోనున్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వం నిరుపేదలు కడుపునిండా భోజనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ లోని పలు చోట్లలో అన్నా కాంటీన్లు ఏర్పాటు చేసింది. నామమాత్ర ధరకే పేదలకు రుచికరమైన, నాణ్యమైన, భోజనాన్ని అందించింది. చంద్రబాబు హయాంలో నిరంతరాయంగా సాగిన ఈ కార్యక్రమం.. వైసీపీ దుర్మార్గపు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాళం పడింది. బాబు బ్రాండ్‌గా మారిన అన్నా క్యాంటీన్లను అక్కసుతో మూసేసింది జగన్ సర్కార్.. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను కొనసాగించాలని బతిమాలని జగన్ కడుపు మంట చల్లారలేదు.. బాబుకి పేరు రాకూడదనుకున్నారు..
జగన్ సర్కార్ కుట్ర చేసి అన్నా క్యాంటీన్లను మూసి వేసినా టీడీపీ నేతలు తమ సొంత ఖర్చుతో స్వచ్చందంగా నడిపించారు. పేదలకి రెండు పూటలా కడుపునిండా భోజనం అందించారు.. కేవలం 5 రూపాయలకే వారికి భోజనం పెట్టారు.. దీనిపై ఎన్ని అణచివేతలకు గురి చేసినా వెన్ను చూపలేదు, మడమ తిప్పలేదు తెలుగు తమ్ముళ్లు.. తమ సొంత ఖర్చులతో అయిదేళ్లు నడిపించారు. ఇక ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధికారంలోకి రాగానే వీటిని తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇవ్వగా ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఫైలుగా సంతకం కూడా చేసారు. దీంతో అన్నా క్యాంటీన్ల రీ-ఓపెన్ పనులు ప్రారంభం అయ్యాయి.
అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు సర్వం సిద్ధమైంది. టీడీపీ ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. శనివారం నుంచి ఈ పునరుద్దీకరణ పనులు ప్రారంభం అయ్యాయి. సెప్టెంబరు 21 నాటికి 203 క్యాంటీన్లు ప్రారంభం చేయనున్నారు.. సీఎం చంద్రబాబు గురువారం వీటిపై సంతకం చేయడంతో అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు. ఇందులో నగర, పురపాలక సంఘాల కమిషనర్లతో పాటు ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను భాగస్వాములను చేశారు. 2019లో ప్రారంభించిన క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం సూచించింది.
గతంలో రాష్ట్రవ్యాప్తంగా 203 క్యాంటీన్ భవనాలు మంజూరు కాగా అందులో 184 క్యాంటీన్ల నిర్మాణం మాత్రమే పూర్తయ్యాయి. ఈలోపు వైసీపీ అధికారంలోకి రావడంతో మిగిలిన క్యాంటీన్ల పనులు మూలనపడ్డాయి. అంతేకాకుండా అన్నా క్యాంటీన్ భవనాలను వైసీపీ ప్రభుత్వం ఇతర కార్యకలాపాలకు వినియోయించుకుంది. దీనిపై చంద్రబాబు గతంలో మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రానే మొట్టమొదట అన్నా క్యాంటీన్లను పునప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఫైల్ మీద సంతకం చేసారు. క్యాంటీన్ పనులు చకచకా అవుతున్నాయి. అంతేకాకుండా ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ ముందంజలో ఉన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినందుకు తన 64వ పుట్టినరోజు సందర్భంగా.. సొంత నియోజకవర్గమైన హిందూపురం పరిధిలో మొట్టమొదటి అన్న క్యాంటీన్‌ను పున: ప్రారంభించారు. దాదాపు 200 మంది నిరు పేదలకు మధ్యాహ్నం నుంచి ఉచితంగానే భోజనం వడ్డించారు. మరోవైపు కొత్త క్యాంటీన్ భవన నిర్మాణ పనులకు పాత డిజైన్ ప్రకారమే టెండర్లు పిలవాలని ప్రభుత్వం ఆదేశించింది.
పునరుద్దీకరణ కార్యాచరణ ప్రణాళిక ఇలా సాగింది…
15.6.24: పట్టణంలోని స్థానిక సంస్థల కమిషనర్లు తమ పరిధిలోని క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితి పరిశీలించి, భవనం, ఫర్నిచర్, ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) పరికరాలు, ఇతర అవసరాలపై ప్రాథమిక నివేదికను సిద్ధం చేస్తారు.
19.6.24: పాత డిజైన్ ప్రకారం మున్సిపల్ ఇంజినీర్లు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి కమిషనర్లు క్యాంటీన్ల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలి.
30.6.24: క్యాంటీన్ల నిర్మాణం జరగని పలు చోట్ల పనులు ప్రారంభించేందుకు కమిషనర్లు స్థానిక నేతల సహకారంతో స్థలాలను ఎంపిక చేయాలి. అథ అయిదేళ్ళుగా క్యాంటీన్లలో నడుస్తున్న వార్డు సచివాలయాలను అక్కడి నుంచి తరలించి వాటికి ప్రత్యామ్నాయ భవనాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
30.7.24: అన్నా క్యాంటీన్లకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించేందుకు టెండర్లు వేసి ఏజెన్సీలను కంఫర్మ్ చేయాలి. IoT పరికరాల సమీకరణ, క్యాంటీన్ల పరిస్థితిని అమానించి, స్మార్ట్ బిల్లింగ్, విరాళాల నిర్వహణ కోసం సాఫ్ట్‌వేర్ కంపెనీలను ఫైనల్ చేయాలి.
10.8.24: కొత్త క్యాంటీన్ బిల్డింగ్ నిర్మాణ పనులు, కొత్త పరికరాలు, సాఫ్ట్‌వేర్ అనుసంధానం, ఏజెన్సీలతో చేసుకున్న కనీస అవసరాలు, సదుపాయాల ఒప్పందాలకు గవెర్నమెంట్ నుంచి పెర్మిషన్స్ తీసుకోవాలి.
15.8.24: మిగిలిన క్యాంటీన్ భవనాల నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టు కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకోవాలి. తాగునీరు, విద్యుత్, ఇంటర్నెట్ సహా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.
21.9.24: సెప్టెంబరు 21 2024లోగా పట్టణ, నగరపాలక సంస్థల్లో 203 క్యాంటీన్లను పునః ప్రారంభించాలి.











