టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది రష్మిక మందన్న. కోలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ అమ్మడు ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా హిట్ తో మంచి జోష్ మీద ఉన్న సూర్య తన తదుపరి సినిమాను పాండిరాజ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను ఫైనల్ చేసారని సమాచారం. ఇప్పటికే అనేకమంది టాప్ హీరోయిన్స్ ను పరిశీలించిన దర్శుకుడు పాండిరాజ్ ఫైనల్ గా రష్మికను ఓకే చేశాడని తెలుస్తోంది.
ఈమధ్యనే ఈ సినిమా కథను రష్మికకు దర్శకుడు వినిపించాడని, కథలోని తన పాత్ర నచ్చడంతో రష్మిక కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని సమాచారం. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను దర్శకనిర్మాతలు తెలియజేస్తారని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే అనేక డబ్బింగ్ సినిమాల ద్వారా రష్మిక కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం కోలివుడ్ లో రష్మిక, సూర్య తమ్ముడు కార్తీతో ‘సుల్తాన్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు సూర్య సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేయడంతో ఈ అమ్మడు కోలీవుడ్ లో తన సత్తా చాటడానికి రెడీ అవుతోంది.
‘సుల్తాన్’, సూర్య – పాండిరాజ్ సినిమాలు కోలీవుడ్ లో మంచి విజయం సాధిస్తే ఇక రష్మికకు అక్కడ కూడా తిరుగు ఉండదని ఆమె ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. సూర్య నటిస్తున్న 40వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట. సన్ పిక్చర్స్ భారీ వ్యయంతో నిర్మిస్తోంది. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా కన్నడ భాషలో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది రష్మిక. మరి సూర్యతో కలిసి నటిస్తోన్న సినిమా ఆమె కెరియర్ కు ఎంత వరకూ ప్లస్ అవుతుందో చూడాలి.
Must Read ;- సుధా కొంగర దర్శకత్వంలో కార్తీ మూవీ?