టాలీవుడ్ లో వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక మందణ్ణ. కన్నడంలో ‘కిరాక్ పార్టీ’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన రష్మిక అక్కడ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ రష్మిక ఒక క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో నాగశౌర్య హీరోగా చేసిన ‘ఛలో’ చిత్రం ద్వారా ఆమె టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. విజయ్ దేవరకొండతో నటించిన ‘గీత గోవిందం’ సినిమా ద్వారా టాలీవుడ్ లో మొదటి బ్లాక్ బస్టర్ అందుకుంది రష్మిక. అప్పటి నుండి తను వెనుతిరిగి చూసుకోలేదు.
రష్మిక నటించిన సినిమాలన్నీ వరుస పెట్టి విజయాలు సాధించడంతో ఆమె గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది రిలీజ్ అయిన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో స్టార్ హీరోయిన్స్ జాబితాలోకి చేరిపోయింది రష్మిక. ప్రస్తుతం రష్మిక టాలీవుడ్ లోనే కాకుండా అటు కన్నడ ఇటు తమిళ్ బాషలలో కూడా నటిస్తోంది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మరో అరుదైన గుర్తింపును పొందింది.
ఈ సంవత్సరానికి గాను ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా స్థానం సంపాదించుకుంది రష్మిక మందన్న. గూగుల్ లో నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అని సెర్చ్ చేయగా రష్మిక పేరు కనపడుతుంది. ఈ విధంగా రష్మిక ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా’ మారిపోయింది. గూగుల్ లో ఈ విధంగా రావడమంటే మాములు విషయం కాదనే చెప్పాలి. ఈ అరుదైన గుర్తింపు సంపాదించుకున్న అతి తక్కువ మంది సౌత్ ఇండియన్ హీరోయిన్లలో రష్మిక ఒకరు. ప్రస్తుతం ఆమె తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’, శర్వానంద్ కు జోడిగా ‘ఆడోళ్లు మీకు జోహార్లు’ సినిమాలలో నటిస్తోంది. ఇక తమిళంలో కార్తీ నటిస్తోన్న‘సుల్తాన్’ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.
Must Read ;- విజయ్ దేవరకొండ ‘మేజర్’ అవతారం











