వైసీపీకి కష్ట కాలం మొదలయింది.. అధికారం కోల్పోయిన తరవాత ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనను వ్యతిరేకించి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు.. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు జగన్‌కి గుడ్ బై చెప్పారు.. ఈ ఇద్దరు కూడా ఆయన సన్నిహిత కోటరీ వ్యక్తులు కావడం విశేషం.. ఈ ఇద్దరూ జగన్‌తో కలిసి జైలు జీవితం గడిపి, ఆయనతో క్లోజ్‌గా నడిచిన వారే.. ఒకరు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ మోపిదేవి వెంకట రమణ, మరొకరు ఏ2 విజయ సాయి రెడ్డి..
తాజాగా వైసీపీ నుండి మరో ఇద్దరు ఎంపీలు బయటికి రావడానికి సిద్ధం అయ్యారనే ప్రచారం జరుగుతోంది.. ఈ ఇద్దరూ బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది.. ఈ లిస్టులో మాజీ మంత్రి, ప్రస్తుత గొల్ల బాబూ రావు ఒకరు కాగా, మరొకరు కడప జిల్లాకే చెందిన మేడా రఘునాధ్ రెడ్డి అని సమాచారం.. ఇప్పటికే, ఈ ఇరువురు నేతలు హస్తినలోని కమలదళంతో మంతనాలు జరిపారని, నేడో రేపో బయటకు వెళ్లిపోవడం ఖాయం అని వైసీపీ నేతలే సంభాషించుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది..
గొల్ల బాబూరావు.. జగన్‌కి హ్యాండ్ ఇవ్వనున్నారని కొంతకాలంగా కథనాలు వినిపిస్తున్నాయి.. ఆయనకు గత ఎన్నికలలో జగన్ టికెట్ కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారని భావిస్తున్నారట.. మరోవైపు, మేడా రఘునాధ రెడ్డిదీ సేమ్ స్టోరీ.. జగన్‌పై విశ్వాసం కోల్పోయారని చెబుతున్నారట తన సన్నిహితులతో..
ఈ ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరికపై నేడో రేపో ఓ స్పష్టత వస్తుందని సమాచారం.. నేడు ఢిల్లీలో హోమ్ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షాతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అవుతున్నారు.. ఈ భేటీలోనే ఆ ఎంపీల జాయినింగ్‌పై క్లారిటీ రానుందని హస్తిన వర్గాల కథనం.. ఇదే నిజం అయితే, జగన్‌కి భారీ దెబ్బగా భావించవచ్చు.. ఇప్పటికే, ఆయనకు గ్రాడ్యుయేట్ ఎమ్‌ఎల్‌సీ ఎన్నికలతో ఊహించని షాక్ తగిలింది.. వైసీపీ మద్దతు ఇచ్చిన నేతలు ఓడిపోయారు. దానినుండి కోలుకోకముందే, ఇద్దరు ఎంపీలు జారిపోవడం వైసీపీకి ఝలక్‌గానే భావించవచ్చు.. మరి, ఆ ఇద్దరిని ఆపడానికి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, వారిని ఎలా కట్టడి చేస్తారో చూడాలి..