సూపర్ సినిమాతో తెలుగు తెర పై ఎంట్రీ ఇచ్చి.. తన అందం, అభినయంతో ఆకట్టుకుని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది బెంగుళూరు భామ అనుష్క. సూపర్ తర్వాత మహానంది, రాజా విక్రమార్క, అస్త్రం..ఇలా కొన్ని సక్సస్ ఫుల్ మూవీస్ లో నటించినప్పటికీ.. అనుష్క కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం మాత్రం అరుంథతి. ఈ సినిమా తర్వాత నుంచి లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ అయ్యింది. పంచాక్షరి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి… ఇలా విభిన్న కథా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది.
అయితే.. అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోకుండా కథ నచ్చితేనే ఓకే చెబుతుంటుంది. ఆ మధ్య నిశ్శబ్థం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్ధాయిలో మెప్పించలేదు. అప్పటి నుంచి కొత్త సినిమా గురించి ఎలాంటి ప్రకటలన ప్రకటించలేదు. దీంతో అనుష్క కొత్త సినిమా ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. యు.వి క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అంటూ టాక్ వినిపించింది. అయితే.. అనుష్క పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించింది.
తన కెరీర్ లో సూపర్ హిట్స్ ఇచ్చినటువంటి టాలీవుడ్ ప్రముఖ బ్యానర్ యూవీ క్రియేషన్ లోనే అనుష్క హ్యాట్రిక్ మూవీని ఇపుడు అధికారికంగా అనౌన్స్ చేసింది. యు.వి క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క మిర్చి, భాగమతి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఈ బ్యానర్ లో హ్యాట్రిక్ మూవీ చేస్తుంది. దీనికి రారా కృష్ణయ్య ఫేమ్ మహేష్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. యు.వి బ్యానర్ అనుష్కకు బాగా కలిసొచ్చింది. మరి.. ఈ సినిమాతో కూడా సక్సస్ సాధిస్తుందేమో చూడాలి.
Must Read ;- తెలుగు తెరకు కొత్త వెలుగు తాన్యా రవిచంద్రన్











