ఏపీలో ఎన్నికల వేడి మొదలయింది.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి.. బెయిల్‌పై చంద్రబాబు నాయుడు విడుదల తర్వాత ఆయనకు ప్రజలు నీరాజనాలు పలికారు.. సుమారు 180 కిలోమీటర్ల జరిగిన ర్యాలీతో బాబుకి ఎంతటి ఆదరణ దక్కిందో, ప్రజలలో బాబు పట్ల ఎంతటి అభిమానం ఉందో తెలిసివచ్చింది.. ఇటు జగన్ సర్కార్‌పై వ్యతిరేకత ఏ రేంజ్‌లో ఉందో ప్రజలకు అర్ధం అయింది.. ఈ ప్రభావం తాజాగా వైసీపీ ఎమ్‌ఎల్‌ఏ, ఎంపీతోపాటు ఆ పార్టీ నేతలకు కూడా క్లారిటీ వచ్చింది.
బాబు బయటికి వచ్చిన తర్వాత వైసీపీలోనూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఆ పార్టీ నుండి కొందరు ఎమ్‌ఎల్‌ఏలు, ఎంపీలు జంపింగ్ జపాంగ్‌కి రెడీ అవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ లిస్టులో మొదట వినిపిస్తోన్న పేరు దర్శి ఎమ్ఎల్‌ఏ మద్దిశెట్టి వేణు.. గత కొంతకాలంగా వైసీపీ అధినేత జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న మద్దిశెట్టి.. ఆ పార్టీకి షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట.. దర్శి వైసీపీలో గ్రూపుల కుమ్ములాట జరుగుతోంది.. మద్దిశెట్టికి పోటీగా నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ వర్గం ఉంది.. ఈ రెండు గ్రూపుల మధ్య వార్ జరుగుతోంది కొంతకాలంగా.. గత ఎన్నికలలో బూచేపల్లి ఎమ్‌ఎల్‌ఏగా పోటీ చేయలేదు.. రేస్ నుండి తప్పుకున్నారు..
ఈ దఫా ఎన్నికలలో బూచేపల్లి దర్శి నియోజకవర్గం నుండి బరిలోకి దిగాలని భావిస్తున్నారు.. మద్దిశెట్టికి చెక్ పెడుతున్నారు. ఈ రెండు గ్రూపుల మధ్య సయోధ్య కోసం జగన్ రంగంలోకి దిగారు. ఇద్దరినీ సమన్వయం చేసుకోవాలని సూచించారు.. బూచేపల్లికి స్థానికంగా భారీ అనుచర గణం ఉంది.. ఆర్ధికంగా కూడా బలం ఉంది.. ఇటు, ఆయన తల్లి వెంకాయమ్మ జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా ఉన్నారు.. దీంతో, నియోజకవర్గానికి దక్కాల్సిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను తమ అనుచరులకే కేటాయిస్తున్నారు.. ఈ పరిణామాలపై మద్దిశెట్టి గుర్రుగా ఉన్నారు..
అంతేకాదు, ఇటీవల దర్శికి కొత్త డీఎస్‌పీ వచ్చారు.. ఆయన మద్దిశెట్టిని కలవకుండా, నేరుగా వెళ్లి తాడేపల్లిలో ఉన్న వైవీ సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వచ్చారు.. అంతకుమందు ఉన్న డీఎస్‌పీని మద్దిశెట్టి ప్రమేయం లేకుండానే డీఎస్‌పీని బదిలీచేశారు.. ఈ పరిణామాలపై మద్దిశెట్టి కినుక వహించారు.. బూచేపల్లికి తాడేపల్లి పెద్దల అండదండలు ఉన్నాయని భావిస్తోన్న మద్దిశెట్టి… త్వరలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నారట… ఆ తరవాత తన రాజకీయ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.. మరి, మద్దిశెట్టి అడుగులు ఎటువైపు వేస్తారో, దర్శి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చూడాలి..