కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌లపై హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఐఏఎస్ అధికారులు బి.రామారావు, కె.ప్రవీణ్‌కుమార్‌లను ఈనెల 19లోపు కోర్టు ముందు హాజరుపర్చాలని విజయవాడ పోలీస్ కమిషనర్, గుంటూరు ఎస్పీలను శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశించారు.
హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా..
విజయనగరం జిల్లాలోని బాలుర వసతి గృహం ఉద్యోగి జి.చంద్రమౌళికి హెచ్‌డబ్ల్యూఓ గ్రేడ్-1గా పదోన్నతి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేయకపోవడంతో చంద్రమౌళి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ బి.రామారావు, ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్‌లు ఫిబ్రవరి 5న విచారణకు కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించినా వివిధ కారణాలు చూపుతూ వారు హాజరు మినహాయింపు పిటిషన్ వేశారు. దాన్నికొట్టివేసిన న్యాయమూర్తి ఇద్దరు ఐఏఎస్ అధికారులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
Must Read ;- హైకోర్టు ఆదేశాలంటే.. అంత చులకనా?