నటసింహ నందమూరి బాలకృష్ణ .. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ రద్దు అవడమే కాకుండా.. విడుదల సైతం వాయిదా పడింది. ఉగాది కానుకగా విడుదలైన అఖండ టీజర్ రికార్డు వ్యూస్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దాని కారణంగా అఖండ సినిమా మీద రెట్టింపు అంచనాలు నెలకొన్నాయి.
బాలయ్య, బోయపాటి గత చిత్రాలు సింహ, లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్టైన నేపథ్యంలో అఖండ తో హ్యాట్రిక్ సెన్సేషన్ ను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉండగా.. బాలయ్య పుట్టిన రోజున నందమూరి అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ను రెడీ చేస్తున్నారు అఖండ మేకర్స్. జూన్ 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘అఖండ’ సినిమాలోని స్పెషల్ సాంగ్ ను విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నారు.
అఖండలోని ఒక అదిరిపోయే సాంగ్ ను ఆల్రెడీ కంపోజ్ చేశాడట సంగీత దర్శకుడు తమన్. టీజర్ కు సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నిచ్చిన తమన్.. అఘోర గెటప్ లోని బాలయ్య మీద ఈ సాంగ్ ను ట్యూన్ చేశాట. ఈ పాట అభిమానుల్ని అలరిస్తుందని చెబుతున్నారు. మరి జూన్ 10న సోషల్ మీడియాను, యూ ట్యూబ్ ను షేక్ చేయబోతున్న అఖండ పాట గురించి అభిమానులు ఇప్పటి నుంచీ డిస్కస్ చేసుకుంటున్నారు. మరి ఆ పాట ఏ రేంజ్ లో సెన్సేషన్ కానుందో చూడాలి.