నటసింహ నందమూరి బాలకృష్ణతో సినిమా చేసే ఛాన్స్ కోసం తాను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానని దర్శకుడు అనిల్ రావిపూడి ఇదివరకే చెప్పారు. బాలకృష్ణ 100వ సినిమానే తాను చేయాలనుకున్నానని, కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదని కూడా ఆయన చెప్పిన విషయం తెలిసిందే.అయితే అనిల్ కోరిక ఇన్నాళ్ళకు ఫలించబోతోందనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
బాలయ్య వందవ చిత్రం డైరెక్ట్ చేసే ఛాన్స్ కోసం అనిల్ రావిపూడి తీవ్రంగా ప్రయత్నించగా కుదరలేదు. ఆ తరువాత ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీ అయ్యారు. అయితే బాలయ్యతో సినిమా చేయాలనే తన కోరికను ఎలాగైనా నెరవేర్చుకోవాలని అనిల్ గట్టిగానే కృషి చేశాడట. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షోకి గెస్ట్ గా వచ్చినప్పుడు అనిల్ ఇదే విషయాన్ని చెప్పాడు. బాలయ్య సైతం అనిల్ రావిపూడి ప్రపోజల్ కు అక్కడికక్కడే సై అనేశారు. బాలయ్య ఓకే అనడమే ఆలస్యం బాలకృష్ణ కోసం కథని ప్రిపేర్ చేసిన అనిల్ ఇటీవలే అది ఆయనకు వినిపించాడట.బాలయ్యకి కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారని టాక్.
అయితే బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. కెరియర్ పరంగా ఇది బాలకృష్ణకి 107వ సినిమా. రాయలసీమ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.కాగా, ఈ సినిమా తరువాత బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ లోని చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ సినిమాలో బాలకృష్ణ 14 ఏళ్లు జైలు శిక్షను అనుభవించి వచ్చిన ఒక నేరస్థుడి పాత్రను పోషించనున్నారని సమాచారం.
ఇక ఈ మూవీలో మొదటి భాగం అంతా కూడా బాలయ్య మార్కు యాక్షన్ తో ఉండబోతోందట. సెకండాఫ్ మాత్రం పూర్తి భిన్నంగా అనిల్ మార్కు కామెడీతో కథ నడుస్తుందని సమాచారం.అంతేకాకుండా చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాత్రలో రవితేజ కూడా కనిపించబోతున్నారని టాక్. బాలయ్య, రవితేజ మధ్య సెగ్మెంట్ ని అనిల్ చాలా ప్రత్యేకంగా డెజయిం చేశారట. ఇక ఈ మూవీలో బాలయ్య సరసన ఒక కథానాయికగా మెహ్రీన్ ను అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
మరి బాలయ్య అనిల్ కాంబో లో వస్తున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో అనేది వేచి చూడాల్సిందే.