‘దొరసాని’ చిత్రంతో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక.. కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ .. అందులోని ఆమె నటనకి మంచి పేరొచ్చింది. ప్రస్తుతం కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ మూవీలో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తోన్న ఆమె .. రీసెంట్ గా ఓ మలయాళ రీమేక్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. లాస్టియర్ నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ గా విడుదలైన ‘కప్పేళ’ మలయాళ మూవీ సూపర్ హిట్టయింది. దాంతో ఈ మూవీ రైట్స్ ను సితారా ఎంటర్ టైన్ మెంట్స్ వారు కొనుగోలు చేశారు.
త్వరలోనే ‘కప్పేళ’ తెలుగు వెర్షన్ లాంఛ్ కాబోతోంది. మలయాళ వెర్షన్ లో అన్నాబెన్ అనే అమ్మాయి హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు లో ఆ పాత్ర శివాత్మికను వరించిందట. కథ బాగా నచ్చడంతో వెంటనే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక అందులో ప్రధాన పాత్రలు పోషించిన శ్రీనాథ్ భాసి, రోషన్ మ్యాథ్యూ పాత్రల్ని తెలుగులో .. విశ్వక్ సేన్, నవీన్ చంద్ర పోషించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.
అనుకోకుండా రాంగ్ కాల్ కు కనెక్ట్ అయిన ఓ దిగువ మధ్యతరగతి అమ్మాయి.. ఓ అపరిచితుడితో ఫోన్ చాటింగ్ మొదలుపెడుతుంది. అతడో ఆటో డ్రైవర్. కొన్ని రోజులకు ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలని నిర్ణయించుకుంటారు. దాంతో ఆ అమ్మాయి ఇంట్లో చెప్పకుండా.. అతడ్ని కలవడానికి పక్కనే ఉన్న ఓ టౌన్ కు ఒంటరిగా వెళుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి అతడ్ని కలుసుకుందా? అక్కడ ఆ అమ్మాయికి ఎదురైన అనుభవం ఏంటి? అన్నదే మిగతా కథ. మలయాళ సంస్కృతిని ప్రతిబింబిస్తూ .. తెరకెక్కిన ఈ సినిమా ను తెలుగు నేటివిటీ కి అనుగుణంగా మార్చుతున్నారు. త్వరలోనే ప్రారంభం కాబోతున్న కప్పేళ తెలుగు వెర్షన్ కి దర్శకుడు ఎవరు అనే విషయం ఇంకా తెలియదు. మరి శివాత్మికకి ఈ మూవీ ఏ మేరకు హెల్ప్ అవుతుందో చూడాలి.
Must Read : రాజశేఖర్ కూతుళ్ళ తో యంగ్ హీరో రొమాన్స్ !