సినిమా రంగంలో కాంబినేషన్లకు ఉండే క్రేజే వేరు. ట్రిపుల్ ఆర్ తో ఎన్టీఆర్,రామ్ చరణ్ లను కలిపిన రాజమౌళి మరో క్రేజీ కాంబినేషన్ పై దృష్టిపెట్టినట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రానుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ నిర్మించనున్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రాజమౌళి మహేష్ తో సినిమాను చేయనున్నారు. దీంతో మహేష్ ని ఎలా చూపించనున్నారు..? ఏ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయనున్నారు..? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే సినిమా మల్టీస్టారర్ మూవీ అని.. అందులో మరో స్టార్ హీరోకి ఛాన్స్ ఉందని.. ఆ హీరోను కూడా టాలీవుడ్ నుంచే తీసుకోవాలి అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.
మరో విషయం ఏంటంటే.. ఆ పాత్రకు నటసింహ నందమూరి బాలకృష్ణ అయితే.. బాగుంటుందనే ఆలోచన రాజమౌళికి వచ్చిందని..దీని గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కోసం కథ రాస్తున్నారు. కథలో నిజంగానే ఓ కీలకమైన పాత్ర ఉందట. ఈ పాత్ర దాదాపుగా నలభై నిమిషాలు ఉంటుందట. ప్రచారంలో ఉన్నట్టుగా మహేష్ తో రాజమౌళి తెరకెక్కించే సినిమాలో బాలయ్య నటిస్తే.. మరింత క్రేజ్ రావడం ఖాయం.











