అద్దంకి, పర్చూరు, చీరాల, దర్శి, ఒంగోలులో ఉన్న కరణం వర్గం అక్కడి కీలక సమయాల్లో ఎమ్మెల్యే సీటు గెలుపోటములను ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉండటమే కరణం కి + పాయింట్ అవుతోంది. బీజేపీలో ఉన్న సుజనా చౌదరితో బలరాంకి మంచి అవగాహన ఉండటం కూడా ప్లస్ పాయింటే. ఇన్ని ప్లస్సులు ఉన్నప్పుడు.. సహజంగా ఆయనదే పైమాటగా చెల్లుబాటు కావడంలో ఆశ్చర్యం లేదు.
అందుకే ప్రకాశం జిల్లా చీరాలలో వైసీపీ ముఠాల మధ్య ఉన్న కుమ్ములాటల్లో జిల్లాలోని కీలక నాయకుడు, జగన్ కు మామయ్య బాలినేని శ్రీనివాస రెడ్డి.. కరణం బలరాంకే అండగా నిలుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇన్నళ్లూ సజ్జల రామకృష్ణారెడ్డి , ఆమంచికి పెట్టని కోటలా ఉన్నారు. ఇప్పుడు ఆ కోట కూడా రక్షణ కల్పించడం లేదని తెలుస్తోంది.
బలరాంకు మరి కొన్ని ఎడ్వాంటేజీలు కూడా ఉన్నాయి. పర్చూరులో తన రాజకీయ భవిష్యత్తుకోసం ఇండైరెక్టు గా బలరాం కి ఆర్ధికంగా… టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు నిలిచే అవకాశం ఉంది. దీనికి ఉన్న కారణం ఒక్కటే.. టీడీపీకి బీజేపీకి భవిష్యత్తులో పొత్తు కుదిరితే దగ్గుబాటి కుటుంబం .. పర్చూరు కచ్చితంగా అడుగుతుంది. అప్పుడు వైసీపీలోకి ఏలూరి వెళితే అతనికి అంగబలం కావాలి అవి బలరాం, వెంకటేష్ నిలబడతారు. దీనికి ఉదాహరణ 2019 ఎన్నికల్లో బలరాం కి ఏలూరు ఖర్చు పెట్టాడు.. దానికి ప్రతిఫలంగా బలరాం వర్గం నిలబడింది అనే ప్రచారం ప్రజల్లో ఉంది.
తమకు బలం ఉన్నచోట.. కరణం వల్ల వైసీపీ పార్టీల్లో ఉన్న అద్దంకిలోని గరటయ్య వర్గం, పర్చూరులోని గొట్టిపాటి భరత్, అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆమంచికి భవిష్యత్తులో చీరాలలో సహకారం అందించే అవకాశం కూడా కనిపిస్తోంది.
గొట్టిపాటి కుటుంబానికి కూడా అద్దంకి, పర్చూరులో వర్గ బలం ఉంది. అవసరం అయితే వీరికి పర్చూరులో తన కొడుకు రాజకీయ భవిష్యత్తుకోసం… ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్రావు కూడా సహకారం అందించే అవకాశం ఉంది. ఇలాంటి సమీకరణాల నేపథ్యంలో ప్రకాశం జిల్లా వైసీపీ ముఠా రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి.











