రాజకీయ నేతలు, అధికారులకు లంచాలు ఎరవేసి ప్రాజెక్టులను చేజిక్కించుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత దేశ పారిశ్రామిక దిగ్గజం గౌతం అదానీతో గత వైసీపీ సర్కారు చేసుుకున్న ఒప్పందాలు ఏపీలో రాజకీయ వేడిని రాజేశాయి. అదానీ సంస్థలతో జరిగిన నాటి ఒప్పందాలపై నాడు విద్యుత్ శాఖ మంత్రి హోదాలో జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సంతకం చేశారంటూ వైసీపీ చెప్పడం, దానిపై బాలినేని కౌంటర్లు ఇవ్వడం, వాటిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనదైన శైైలి విసుర్లు సంధించడం, వాటిపై బాలినేని తిరిగి తూటాల్లాంటి మాటలను పేల్చడంతో ఏపీలో నిజంగానే రాజకీయం రసకందాయంలో పడిందని చెప్పక తప్పదు. తాను నోరు విప్పితే… వైసీపీ నేతలు తట్టుకోలేరని, అసత్యాలు వల్లించే చెవిరెడ్డి లాంటి వారు అయితే మాడి మసైైపోతారంటూ బాలినేని మంగళవారం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఓ రాజకీయ నేతగా ఇప్పటిదాకా తాను హద్దుల్లోనే ున్నానన్న బాలినేని… అవతలి వారు హద్దులు దాటితే…తానూ హద్దుల దాటాల్సి వస్తుందని, ఇది వైసీపీకి, ఆ పార్టీ అదినేత వైఎస్ జగన్ కు మంచిది కాదని హెచ్చరించడం గమనార్హం.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల దాకా బాలినేని వైసీపీలోనే కొనసాగారు. జగన్ తొలి కేబినెట్ లో బెర్తు దక్కిన బాలినేని ఇంధన శాఖ బాధ్యతలను పర్యవేక్షించారు. ఇంధన శాఖ మంత్రి హోదాలోనే ఆయన అదానీ సంస్థలతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సంతకాలు పెట్టారంటూ వైైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే సార్వత్రిక ఎన్నికల కంటే ముందు నుంచి వైసీపీ అధిష్ఠానంతో అంంటీముట్టనట్టుగా వ్యవహరించిన బాలినేని… ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఆ వెంటనే నేరుగా జనసేనలో చేరిపోయారు. వైసీపీని వీడి జనసేనలో చేరిన తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్ గానే ఉన్న బాలినేని… ఇటీవల జగన్ క తన సోదరి షర్మిలతో పొడచూపిన ఆస్తలు తగాదాల్లో గళం విప్పారు. తాజాగా అదానీ సంస్థతో జరిగిన ఒప్పందాలపై తానే సంతకం పెట్టానంటూ వైసీపీ చేసిన వ్యాఖ్యలపై బాలినేని తీవ్రంగానే స్పందించారు. బాలినేని వ్యాఖ్యలను ఒకింత సీరియస్ గా తీసుకున్న చెవిరెడ్డి.. బాలినేని చెప్పేవన్నీ అబద్దాలేనన్న కోణంలో సంచలన ఆరోపణలు గప్పించారు. ఈ ఆరోపణలపై బాలినేని తనదైైైన శైలి మాటల తూటాలతో విరుచకుపడిపోయారు.
తాను వైసీపీపై నోరు విప్పితే ఆ పార్టీతో పాటు ఆ పార్టీ అధినేతగా ఉన్న జగన్ కు తీవ్ర ఇబ్బందులు తప్పవని బాలినేని వ్యాఖ్యానించారు. అలా జగన్ కు ఇబ్బందులు కొని తెచ్చేందుకు చెవిరెడ్డి సిద్ధమైతే తనకేమీ అభ్యంతరం లేదని కూడా ఆయన అన్నారు. ఏ విషయాన్నిఅయినా… ఇప్పటిదాకా తానుు ఓ పద్దతి ప్రకారమే నడుచుకున్నానని అన్నారు. అయితే ,చెవిరెడ్డి లాంటి నేతలు ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తూ ఉంటే… చూస్తూ సహించేది లేదని హెచ్చరించారు. వైసీపీ అంతర్గత విషయాలు కూడా తనకు తెలుసునని, వాటిని బయటపెట్టేందుకు కూడా తాను సిద్ధమేనని కూడా బాలినేని వ్యాఖ్యానించారు. తాను నిజాలు ాట్లాడితే చెవిరెడ్డితో పాటు వైసీపీ నేతలెవ్వరూ తట్టుకోలేరన్నారు. చెవిరెడ్డి గుట్టు అన్నీ విప్పుతానని, అదే జరిగితే… చెవిరెడ్డి మాడి మసి అయిపోతారన్నారు. తనకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్ది రాజకీయ బిక్ష పెట్టారిన్న బాలినేని… జగన్ మాత్రం తనను సర్వనాశనం చేశారని ఆరోపించారు. వైఎస్ ఫ్యామిలీ అంటే… జగన్ ఒక్కరే కాదన్న బాలినేని… విజయమ్మ, షర్మిలలు కూడా వైఎస్ కుటుంబమేనని తెలిపారు. ఈ ప్రాథమిక సూత్రాలను మరిచి చెవిరెడ్డి లాంటి వారు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.