ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.లోక్‌సభ స్పీకర్ అనుమతి లేకుండా పార్లమెంటు సభ్యుడిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అనుమతించిందని ప్రశ్నించారు.ఒక ఎంపీని కారులోకి బలవంతంగా తోస్తారా అంటూ ప్రశ్నించారు.మీ మిత్రుడైన ఏపీ సీఎం జగన్ కోసం నియంతృత్వ పాలన సాగిస్తున్నారా అంటూ సీఎం కేసీఆర్‌ను విమర్శించారు.కోవిడ్ రోగులున్న ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణ సరిహద్దుల్లో ఆపుతున్న తెలంగాణ పోలీసులు మఫ్టీలో ఉన్నపోలీసులను ఎలా రానిచ్చారని అన్నారు.లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి పదుల సంఖ్యలో ఏపీ సీఐడీ పోలీసుల్ని తెలంగాణ రాష్ట్రంలోకి ఎలా అనుమతించారని సంజయ్ ప్రశ్నించారు.
Must Read ;- రఘురామరాజుపై దేశద్రోహం కేసు.. టీవీ5, ఏబీఎన్‌లపై కూడా!











